Viral: వెయ్యి రూపాయలకు కొని 40 ఏళ్లుగా మూలన పడేశారు.. కట్‌చేస్తే.. వేలంలో అసలు విలువ తెలిసి షాక్..

|

Aug 10, 2022 | 5:48 AM

ఓ వ్యక్తి వెయ్యి రూపాయలకు ఓ పెట్టె కొని తన కూతురికి బహుమతిగా ఇచ్చాడు. బహుమానం అందుకున్న చాలా ఏళ్ల తర్వాత ఆ పెట్టె అసలు విలువ తెలుసుకుని కూతురికి ఆశ్చర్య పోయింది.

Viral: వెయ్యి రూపాయలకు కొని 40 ఏళ్లుగా మూలన పడేశారు.. కట్‌చేస్తే.. వేలంలో అసలు విలువ తెలిసి షాక్..
Antique Piece Value
Follow us on

ఓ వ్యక్తి దాదాపు రూ.1100 పెట్టి ఓ పెట్టెను కొని తన కూతురికి బహుమతిగా ఇచ్చాడు. బహుమతి అందుకున్న చాలా సంవత్సరాల తరువాత,  ఆయన కుమార్తెకు ఈ పెట్టె అసలు విలువ తెలిసింది. ఈ విషయం తెలిసి ఆమె ఆశ్చర్యపోయింది. అప్పటి వరకు ఆమె దానిని చిన్న పెట్టెలా భావించింది. వాస్తవానికి, ఆయన కుమార్తెకు లభించిన బహుమతి చాలా అరుదైన పెట్టెగా మారింది. ది మిర్రర్ ప్రకారం, బాక్స్ లూయిస్ విట్టన్ కంపెనీకి చెందినది. ఇటీవలే ఈ పెట్టె వేలంలో విక్రయించారు. అప్పుడే దాని విలువ తెలిసింది. వేలంలో ఈ పెట్టె దాదాపు రూ.10 లక్షలకు అమ్ముడుపోయింది.

ఆ వ్యక్తి 1984లో రూ.1100కి ఈ సింపుల్‌గా కనిపించే బాక్స్‌ని కొనుగోలు చేశాడు. అప్పుడు దాని ధర లక్షల్లో ఉంటుందని అతనికి తెలియదు. బ్రిటన్‌కు చెందిన ఈ వ్యక్తి తన వస్తువులను ఉంచడానికి కుమార్తె మెలిస్సాకు ఈ పెట్టెను బహుమతిగా ఇచ్చాడు. ఆ వ్యక్తి దానిని లండన్‌లోని ట్వికెన్‌హామ్ సమీపంలోని సెయింట్ మార్గరెట్ గ్రామంలోని బ్రిక్-ఎ-బ్రాక్ దుకాణం నుంచి కొనుగోలు చేశాడు.

40 ఏళ్లపాటు బాక్సుల్లో బట్టలు ఉంచేశారు..

ఇవి కూడా చదవండి

మెలిస్సా దాదాపు 40 సంవత్సరాల పాటు ఈ పెట్టెలో బట్టలు ఉంచింది. అయితే గత సంవత్సరం పురాతన వస్తువుల రోడ్‌షోకు ఆమె దానిని తీసుకెళ్లినప్పుడు, ఇది సాధారణ పెట్టె కాదు, అరుదైనది అని తెలిసి ఆమె ఆశ్చర్యపోయింది. ఇది 100 ఏళ్ల నాటి లూయిస్ విట్టన్ బాక్స్ అని తేలింది.

అప్పుడు 56 ఏళ్ల మెలిస్సా బాక్స్‌ను విక్రయించాలని నిర్ణయించుకుంది. జులై 30 న బదులుగా రూ. 10 లక్షలు రావడంతో ఆశ్చర్యపోయింది. లండన్‌కు చెందిన హాన్సన్స్ వేలం నిర్వాహకులు అరుదైన పెట్టె కోసం వేలం నిర్వహించారు.

టీవీలో లూయిస్ విట్టన్ గురించి తాను తరచుగా విన్నానని, అక్కడ పాతకాలపు వస్తువులు, పురాతన వస్తువులు ప్రదర్శిస్తారని మెలిస్సా పేర్కొంది. ఇది చూసి, ఆమె తన పెట్టెను పురాతన వస్తువుల రోడ్ షోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. అక్కడ చూపించిన తర్వాత ఆ పెట్టెలో ఉన్న నిజం తెలిసిపోయింది.