మూడు పూటలా భోజనం కోసం.. రోజూ 40కి.మీ నడిచే పాపడ్‌ మ్యాన్‌..

తన కుటుంబ పోషణ కోసం చక్రధర్ రాణా ఊరూర వీధుల్లో తిరుగుతూ పాపడ్ అమ్ముతుంటాడు. ఎండావాన, గాలి ఎలాంటి వాతావరణం అయినా సరే, అతడు తన పనిని చేయకుండా ఒక్కరోజూ కూడా ఉండలేడు. అంతేకాదు.. ఇందుకోసం చక్రధర్ రోజూ 30 నుంచి 40 కి.మీ నడిచే పాపడ్‌ అమ్ముతుంటారు. తలపై కరకరలాడే అప్పడాలు మోసుకుంటూ.. ఒక్కొటి పది రూపాయల చొప్పున విక్రయిస్తున్నాడు.

మూడు పూటలా భోజనం కోసం.. రోజూ 40కి.మీ నడిచే పాపడ్‌ మ్యాన్‌..
Papad Man

Updated on: Jan 23, 2025 | 2:32 PM

చాలా మంది జీవనోపాధి కోసం.. కుటుంబాన్ని పోషణ, పిల్లల చదువుల కోసం కష్టపడి పని చేస్తుంటారు. ఎంతోమంది పడరాని పాట్లు పాడుతుంటారు. అందరి కష్టాలు ఎవరికి తెలియదు.. కానీ, కొందరి కథలు తెరపైకి వస్తాయి. అలాంటిదే ఈ కథ కూడా .. దాదాపు 50 ఏళ్లుగా 40 కి.మీ నడిచి తన కుటుంబాన్ని పోషించుకుంటున్న ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి గురించి ఇక్కడ తెలుసుకుందాం..అతడే చక్రధర్‌ రాణా. అసలు విషయం ఏంటంటే…

చక్రధర్ రాణా ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా నివాసి. ఇప్పుడు యావత్‌ దేశం ఆయన కృషికి సెల్యూట్ చేస్తోంది. చక్రధర్ రాణా 50 ఏళ్లకు పైగా పాపడ్ విక్రయిస్తున్నారు. చాలా ఏరియాల్లో ప్రజలు అతన్ని ‘పాపడ్ మ్యాన్’ అని పిలుస్తుంటారు. తన కుటుంబ పోషణ కోసం చక్రధర్ రాణా ఊరూర వీధుల్లో తిరుగుతూ పాపడ్ అమ్ముతుంటాడు. ఎండావాన, గాలి ఎలాంటి వాతావరణం అయినా సరే, అతడు తన పనిని చేయకుండా ఒక్కరోజూ కూడా ఉండలేడు. అంతేకాదు.. ఇందుకోసం చక్రధర్ రోజూ 30 నుంచి 40 కి.మీ నడిచే పాపడ్‌ అమ్ముతుంటారు. తలపై కరకరలాడే అప్పడాలు మోసుకుంటూ.. ఒక్కొటి పది రూపాయల చొప్పున విక్రయిస్తున్నాడు.

గత 50, 60 ఏళ్లుగా తాను పాపడ్‌ విక్రయిస్తున్నానని, మొదట్లో 5 పైసల నుంచి 10 పైసలకు అమ్మేవాడినని, ఇప్పుడు 10 రూపాయలకు విక్రయిస్తున్నానని చెప్పారు. తాను కోల్‌కతా నుండి ఈ అప్పడాలను తీసుకువచ్చానని చెప్పాడు. ప్రతిరోజూ సుమారు 1,000 యూనిట్లను విక్రయిస్తాను. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ పని పట్ల తానేప్పుడూ ఇబ్బంది పడలేదని చెప్పాడు. తను చేస్తున్న పనితో తన కుటుంబాన్ని పోషించగలిగినందుకు చాలా గర్వపడుతున్నానని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us