సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు అప్పుడప్పుడూ అరుదైన చేపలు చిక్కుతుండటం సహజం. అలా వారి వలకు దొరికిన చేపలు భారీ విలువ చేసేవైతే.. ఆ మత్స్యకారుడి పంట పండినట్లే. రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోవచ్చు. అటువంటి సందర్భాలు గంగపుత్రులకు అప్పుడప్పుడు దక్కుతుంటాయి. ఇక తాజాగా ఒడిశాకు చెందిన కొంతమంది మత్స్యకారులకు లక్షలు విలువ చేసే ఓ అరుదైన చేప చిక్కింది.
పారాడిప్‌లోని కొంతమంది మత్స్యకారులు ఫిషింగ్ కోసం వెళ్లగా.. వారికి అరుదైన ఘోల్ చేపలు గేలానికి చిక్కాయి. మొత్తం 11 ఘోల్ చేపలు చిక్కగా.. వీటిని టేలియా చేపలని కూడా పిలుస్తారట. వీటి ద్వారా ఆ మత్స్యకారులు సుమారు రూ. 5.80 లక్షలు సంపాదించారు. ఈ టేలియా చేపలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని, ఆయుర్వేద మెడిసిన్లలో ఈ చేపను ఎక్కువ ఉపయోగిస్తారని తెలుస్తోంది. ఆ జాలర్లు వేలం వేయగా.. ఈ చేప సుమారు రూ. 5.80 లక్షలు పలికింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కనిపించే ఈ ఘోల్ చేపలు ఇనుము, అయోడిన్, మెగ్నీషియం, ఫ్లోరైడ్, సెలీనియం, టౌరిన్ లక్షణాలు కలిగి ఉంటాయి.
Also Read:
Viral Video: అందంతో చంపుతున్న సొట్టబుగ్గల సుందరి.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో.!
Viral Video: ఆఫ్రికన్ పైథాన్‌తో తల్లి చిరుత ఫైట్.. అది చేసిన పనికి నెటిజన్లు సలామ్.. వైరల్ వీడియో!
సెహ్వాగ్, డివిలియర్స్ స్టైల్‌లో.. 17 బంతుల్లో 76 పరుగులు.. బౌలర్లకు చుక్కలే చుక్కలు!