Square Watermelon: ఈ వేసవిలో మార్కెట్‌లో సందడి చేయనున్న స్క్వేర్ పుచ్చకాయ.. స్పెషాలిటీ ఏమిటంటే

|

Apr 12, 2024 | 8:46 AM

సాధారణంగా పుచ్చకాయ అంటే చాలు ఎవరికైనా బయట ఆకుపచ్చ రంగు, లోపల ఎరుపు మాత్రమే గుర్తుకొస్తాయి. ఈ హైబ్రిడ్ సరస్వతి పుచ్చకాయలో బయట పసుపు రంగు లోపల ప్రకాశవంతమైన ఎరుపు రంగు ఉంటుంది  లేదా బయట ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగుల లోపల ఉండే పుచ్చకాయలు ఉంటాయి. ఈ రకమైన పుచ్చకాయలు సైజ్ లో చిన్నవి మాత్రమే కాదు చతురస్రాకారంలో ఉంటాయి. వీటిని పండించడానికి హైబ్రిడ్ రకాల విత్తనాలను ఉపయోగిస్తారు. 

Square Watermelon: ఈ వేసవిలో మార్కెట్‌లో సందడి చేయనున్న స్క్వేర్ పుచ్చకాయ.. స్పెషాలిటీ ఏమిటంటే
Square Watermelon
Follow us on

వేసవి కాలం వస్తే చాలు అందరి చూపు పుచ్చకాయలవైపే ఉంటుంది. పుచ్చకాయ దాహార్తిని తీర్చడమే కాదు శరీరానికి అవసరం అయిన పోషకాలను కూడా అందిస్తుంది. ఎరుపు, గులాబీ , పసుపు రంగుల్లో దొరికే పుచ్చకాయలు గుండ్రంగా మార్కెట్ లో లభ్యమవుతాయి. అమెరికాలో పుచ్చకాయలపై అనేక ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. కాగా మన దేశంలో కూడా పుచ్చకాయ సాగునీ లాభసాటిగా మార్చే విధంగా రైతులు వినూత్న వ్యవసాయ పద్దతులను అవలంభిస్తున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లోని రైతులు సరికొత్త పుచ్చకాయలు పండించి మార్కెట్ లో రిలీజ్ చేయడానికి రెడీ గా ఉన్నారు.

ఈ రకమైన పుచ్చకాయలు సైజ్ లో చిన్నవి మాత్రమే కాదు చతురస్రాకారంలో ఉంటాయి. వీటిని పండించడానికి హైబ్రిడ్ రకాల విత్తనాలను ఉపయోగిస్తారు.

ప్రయాగ్‌రాజ్‌లో రైతులు పండిస్తున్న సరస్వతి రకం పుచ్చకాయలు, సీతాఫలాలలో TSS (టోటల్ సాలిడ్ షుగర్) విలువ ఎక్కువగా ఉంటుంది. ప్రయాగ్‌రాజ్, కౌశంభి, ఫతేపూర్ జిల్లాల్లో సుమారు 1000 ఎకరాల భూమిలో మల్చ్ ఫిల్మ్ కల్టివేషన్ పద్ధతిని ఉపయోగించి సాగు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సాధారణంగా పుచ్చకాయ అంటే చాలు ఎవరికైనా బయట ఆకుపచ్చ రంగు, లోపల ఎరుపు మాత్రమే గుర్తుకొస్తాయి. ఈ హైబ్రిడ్ సరస్వతి పుచ్చకాయలో బయట పసుపు రంగు లోపల ప్రకాశవంతమైన ఎరుపు రంగు ఉంటుంది  లేదా బయట ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగుల లోపల ఉండే పుచ్చకాయలు ఉంటాయి.

వ్యవసాయ నిపుణుడు మనోజ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. పరిమిత వనరులతో పంట మంచి దిగుబడి ఇవ్వడం కోసం రైతులు తైవాన్ నుంచి విత్తనాలను తెచ్చి సాగు చేస్తున్నారు. గుండ్రంగా, చతురస్రాకారంలో ఉండే చిన్న, మధ్య తరహా పుచ్చకాయలను దేశవ్యాప్తంగా పండ్ల ప్రేమికులు ఎక్కువగా కోరుకుంటారు, ఎందుకంటే వాటి మొత్తం ఘన చక్కెర (TSS) విలువ 14 నుండి 15 శాతం వరకు ఉంటుంది.

పుచ్చకాయలను పండిస్తున్న రైతులు మాత్రం తాము సాంకేతిక మార్గదర్శకత్వంతో కొత్త రకాల పుచ్చకాయలు, పుచ్చకాయలను పండించామని, ఈ హైబ్రిడ్ రకం పుచ్చకాయలు రైతులకు మంచి లాభాలను ఇస్తున్నాయని చెబుతున్నారు.

ఒక రైతు ఎకరాకు రూ.80,000 నుండి రూ.90,000 వరకు లాభం పొందగలడు. ప్రస్తుతం ట్రాన్స్-గంగా , యమునా (ప్రయాగ్‌రాజ్), కౌశంభిలోని మూరత్‌గంజ్, ఫతేపూర్ జిల్లాలోని ఖగాలో హైబ్రిడ్ రకం పుచ్చకాయలు సాగు చేస్తున్నారు. సరస్వతి రకం పుచ్చకాయ త్వరలో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి రైతులు రెడీ అవుతున్నారు.

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..