AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: వామ్మో.. ఆ కొట్టుడు ఏందీ తల్లీ.. కుర్రాడిపై మహిళ ప్రతాపం.. తప్పు చేసి మరీ..

Train Passenger Clash Viral Video: రైలు ప్రయాణాల్లో చిన్నపాటి సర్దుబాట్లు లేకపోవడం, క్షణికావేశానికి లోనవడం ఇలాంటి పెద్ద ప్రమాదాలకు దారితీస్తోంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేలా ప్రవర్తించే ఇలాంటి వారిపై రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రయాణాల్లో శాంతియుతంగా ఉండటం మనతో పాటు తోటి వారి రక్షణకు కూడా ఎంతో ముఖ్యం.

Video: వామ్మో.. ఆ కొట్టుడు ఏందీ తల్లీ.. కుర్రాడిపై మహిళ ప్రతాపం.. తప్పు చేసి మరీ..
North Indian Train Fight Video
Venkata Chari
|

Updated on: Jun 05, 2026 | 10:44 AM

Share

North Indian Train Fight Video: రైలు ప్రయాణం అంటేనే సరికొత్త పరిచయాలు, ఆహ్లాదకరమైన క్షణాలు గుర్తొస్తాయి. కానీ, ఇటీవల కాలంలో భారతీయ రైల్వేల్లో జరుగుతున్న కొన్ని సంఘటనలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తోటి ప్రయాణికులు మృగాల్లా ప్రవర్తిస్తూ, ఒకరిపై ఒకరు దాడికి దిగుతున్న షాకింగ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

పిడిగుద్దుల వర్షం.. రైలు బోగీలో హైడ్రామా..

ఉత్తర భారత దేశంలో ప్రయాణిస్తున్న ఒక రైలులో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. సాధారణంగా రద్దీ ఎక్కువగా ఉండే జనరల్ లేదా స్లీపర్ క్లాస్ బోగీల్లో ఇలాంటి గొడవలు జరుగుతుంటాయి. కానీ, ఈ వీడియోలో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకోవడం కలకలం రేపుతోంది. తోటి ప్రయాణికులు వారించడానికి ప్రయత్నిస్తున్నా, ఆగ్రహంతో ఊగిపోతున్న సదరు వ్యక్తులు అస్సలు తగ్గడం లేదు.

ఇవి కూడా చదవండి

అసలేం జరిగిందంటే..

ఫుల్ రద్దీగా ఉన్న ట్రైన్‌లో ఓ మహిళ కూర్చోవడానికి సీటు లేక తన లగేజీ బ్యాగ్‌తో ఇబ్బందిపడుతుంది. అయితే, పైన ఖాళీగా ఉందని తన బ్యాగ్‌ను గట్టిగా విసిరేస్తుంది. ఈ క్రమంలో ఆ బ్యాగ్ పక్కనే ఉన్న తోటి ప్రయాణికుడిపై పడుతుంది. అది గట్టిగా తలగడంతో సదరు ప్రయాణికుడు ఆ బ్యాగ్‌ను ఆ మహిళపై విసిరేస్తాడు. దీంతో కోపం పట్టలేని మహిళ, ఆ కుర్రాడిపై యుద్ధానికి దిగుతుంది. ఇక ఇద్దరు జట్టు పట్టుకుని, బూతులు తిట్టుకుంటూ పొట్టుపొట్టుగా కొట్టున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.

భద్రతపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలు..

సామాజిక మాధ్యమమైన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా బయటకు వచ్చిన ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. భారతీయ రైల్వేలో ప్రయాణికుల భద్రత ఎక్కడ ఉందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రైలులో ఇంత పెద్ద గొడవ జరుగుతున్నా రైల్వే రక్షణ దళం (RPF) సిబ్బంది ఎందుకు అందుబాటులో లేరని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం, తోటి మనుషుల పట్ల కనీస సహనం కోల్పోతున్న నేటి సమాజ పోకడలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కుర్రాడిపై మహిళ వీరంగం.. జట్టు పట్టుకుని మరీ పొట్టుపొట్టుగా..
కుర్రాడిపై మహిళ వీరంగం.. జట్టు పట్టుకుని మరీ పొట్టుపొట్టుగా..
మోదీ దౌత్య వ్యూహానికి రష్యా, అమెరికాలు ఫిదా..
మోదీ దౌత్య వ్యూహానికి రష్యా, అమెరికాలు ఫిదా..
రేపోరేట్ ప్రకటించిన RBI
రేపోరేట్ ప్రకటించిన RBI
ఫోన్‌లో మునిగిపోయింది..తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో తేలింది!వీడియో
ఫోన్‌లో మునిగిపోయింది..తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో తేలింది!వీడియో
శివుడి మెడలో నాగుపాము ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న రహస్యం..
శివుడి మెడలో నాగుపాము ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న రహస్యం..
అర్ధరాత్రి లిఫ్ట్ అడిగిన యువతి.. కట్ చేస్తే.. ట్విస్ట్ అదుర్స్
అర్ధరాత్రి లిఫ్ట్ అడిగిన యువతి.. కట్ చేస్తే.. ట్విస్ట్ అదుర్స్
సొంతిట్లో ఇలాంటి వారు ఉంటే డేంజర్.. సంతోషం దూరమవుతుంది!
సొంతిట్లో ఇలాంటి వారు ఉంటే డేంజర్.. సంతోషం దూరమవుతుంది!
కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం..మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా
కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం..మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా
సీబీఎస్ఈ రీవాల్యుయేషన్‌కు వెల్లువలా దరఖాస్తులు! బిగ్ సైబర్ దాడి..
సీబీఎస్ఈ రీవాల్యుయేషన్‌కు వెల్లువలా దరఖాస్తులు! బిగ్ సైబర్ దాడి..
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ‘బాంబ్రోలిస్తాన్’.. అసలు స్టోరీ ఇదే..!
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ‘బాంబ్రోలిస్తాన్’.. అసలు స్టోరీ ఇదే..!