సరైన టికెట్ లేకుండా ఏసీ కోచ్ ఎక్కిన లేడీ టీచర్.. ఆపై టీటీఈకి చుక్కలు..!
బీహార్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.. టీటీఈ మధ్య జరిగిన అనూహ్య ఘటన ఒకటి ఇటీవల వైరల్ అవుతోంది. ఆమె టికెట్ లేకుండా ఏసీ కోచ్‌లో ప్రయాణించడమే కాకుండా టీటీఈకి చుక్కలు చూపించింది. ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్న మహిళ టీచర్ దగ్గరికి టీటీఈ వచ్చి టికెట్ అడిగాడు. అంతే ఇంకేముంది ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. టీటీఈని గొంతు కోస్తా అంటూ బెదిరింపులకు పాల్పడింది.

బీహార్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.. టీటీఈ మధ్య జరిగిన అనూహ్య ఘటన ఒకటి ఇటీవల వైరల్ అవుతోంది. ఆమె టికెట్ లేకుండా ఏసీ కోచ్‌లో ప్రయాణించడమే కాకుండా టీటీఈకి చుక్కలు చూపించింది. ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్న మహిళ టీచర్ దగ్గరికి టీటీఈ వచ్చి టికెట్ అడిగాడు. అంతే ఇంకేముంది ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. టీటీఈని గొంతు కోస్తా అంటూ బెదిరింపులకు పాల్పడింది. అంతేకాదు వేధింపులకు పాల్పడితే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చి పడేసింది. ఇందుు సంబంధించి మూడు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సరియైన టికెట్ లేకుండా ప్రయత్నిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు టీటీఈ కంట పడింది. దీంతో ఇద్ధరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అదే సమయంలో టీటీఈ ఈ మొత్తం సంభాషణను కెమెరాలో రికార్డ్ చేశారు. ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు దానిని విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో టీచర్, టీటీఈని కార్నర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పదే పదే కనిపించింది. అయితే టీటీఈ ఆమెతో, “మేడమ్, దయచేసి నా నుండి దూరంగా ఉండండి, మీ దగ్గర చెల్లుబాటు అయ్యే టికెట్ లేనందున దయచేసి వెళ్లిపోండి” అని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు.
వీడియోలో, టీచర్ TTE తో వాదిస్తూ, “నువ్వు నాతో దురుసుగా ప్రవర్తిస్తున్నావు” అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె TTE తో, “నువ్వు నన్ను ముట్టుకుంటున్నావు” అంటూ బెదరింపులకు దిగింది. ఆ తర్వాత TTE మరో ప్రయాణీకుడితో, “దయచేసి వచ్చి ఈ విషయం గురించి మాట్లాడు” అని అడిగారు. కానీ ప్రయాణీకులు ఎవరు ముందుకు రాక మౌనంగా ఉండిపోయారు. ఆ మహిళ మరీ అతిగా స్పందించింది. “నువ్వు నన్ను ఇలా వేధిస్తున్నావని నీకు ఇంట్లో తల్లి, చెల్లి లేదా?” అంటూ రుబాబు చేసింది. దీన్నంతటిని సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది.
వీడియోను ఇక్కడ చూడండిః
One more video of the TT – Teacher brawl in Bihar. Unfortunately this man won't find much support as this woman seems to be a professional victim. She's making false accusations that he's touching her. Gajjab capability of lying when video is onpic.twitter.com/B8T0pLhnDW
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) October 9, 2025
ఈ వీడియోను @DeepikaBhardwaj అనే ఖాతా ద్వారా Instagramలో షేర్ చేశారు. ఈ వ్యాసం రాసే సమయానికి, వేలాది మంది దీనిని వీక్షించారు. కామెంట్ల రూపంలో స్పందించారు. ఈ పద్ధతిని ఉపయోగించి పురుషుడిని ట్రాప్ చేయడం ఎంత సులభమో ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. మరొకరు ఈ వీడియోపై కామెంట్ చేస్తూ.. ఈ మహిళ మూడు వీడియోలు కనిపించాయని, మూడింటిలోనూ ఆమె అనుచితంగా ప్రవర్తించినట్లు కనిపించదని పేర్కొన్నారు. మరొక వినియోగదారుడు “దయచేసి ఈ అమ్మాయిపై FIR నమోదు చేయండి!” అని రాశారు.
ఇదిలావుంటే, రాంచీ-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 18629) AC కోచ్‌లో సరియైన టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న టీచర్ రైల్వే అధికారులు గుర్తించారు. చెల్లుబాటు అయ్యే టికెట్ చూపించమని లేదంటే తదుపరి స్టేషన్‌లో దిగమని TTE ఆమెను పదేపదే సూచించారు. అయితే ఆమె అతనిపై వేధింపులకు పాల్పడిందని అధికారులు తెలిపారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుందన్నారు. ఈ నేపథ్యంలోనే రైల్వే చట్టంలోని సెక్షన్లు 145, 146, 147 కింద సదరు మహిళా టీచర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చెల్లుబాటు అయ్యే టికెట్ లేకుండా ప్రయాణించినందుకు ఆమెకు రూ. 990 జరిమానా కూడా విధించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Imagine being a government school teacher, travelling daily in AC class without a ticket, and when the TTE asks for it, instead of showing one, you accuse him of molestation.
Can’t buy a ₹10 ticket but carry the attitude of the President of India. 🤦🏻♂️ These are the very people… pic.twitter.com/zSWd4o1QXj
— Trains of India 🚆🇮🇳 (@trainwalebhaiya) October 9, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
