
భారతదేశంలోని అనేక ముఖ్యమైన నదుల్లో బ్రహ్మపుత్ర నది కూడా ఒకటి. టిబెట్ – అరుణాచల్ ప్రదేశ్ – అస్సాం – బంగ్లాదేశ్ గుండా ప్రవహించి గంగా నదిలో కలుస్తుంది బ్రహ్మపుత్రా నది. ఈ నది అనేక రకాల జీవవైవిధ్యానికి నిలయంగా ఉంది. ఈ నదిలో దాదాపు 150 కి పైగా చేపల రకాలు ఉన్నాయని ఇప్పటికే పరిశోధకులు గుర్తించారు. తాజాగా అస్సాంలోని దిబ్రుగఢ్ సమీపంలోని బ్రహ్మపుత్రలో మరో కొత్త జాతి చేపను గుర్తించారు. జల జీవవైవిధ్యంపై జరుగుతున్న సర్వేలో గుర్తించబడిన ఈ చేప ప్రత్యేకతలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
బ్రహ్మపుత్ర నదీ జలాల్లో శాస్త్రవేత్తలు పేథియా దిబ్రూఘర్నేసిస్ అనే కొత్త చేపను కనుగొన్నారు. ఇది సైప్రినిడ్ జాతికి చెందిన చిన్న చేప. తోకపై నల్ల మచ్చ, అసంపూర్ణ లేటరల్ లైన్, ప్రత్యేక పొలుసుల అమరిక ఈ చేప ప్రత్యేక లక్షణాలు. పైభాగంలోని రెక్కకు, లేటరల్ లైన్ కు మధ్యలో 4 పొలుసుల వరసలు, అదేవిధంగా కింది రెక్కకు, లేటరల్ లైన్ కు మధ్యలో మరో నాలుగు పొలుసుల వరసలు క్రమ పద్ధతిలో ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. అలాగే అనేక ఇతర జాతుల్లో కనిపించే నోటి దగ్గర మీసాల లాంటి నిర్మాణాలు, హ్యూమరల్ మార్క్ ఈ చేపకు కనిపించదని చెప్పారు.
బీహార్‌కు చెందిన దిబ్రూగఢ్ ప్రాంతంలో కనుగొనబడిన ఈ చేప బ్రహ్మపుత్ర నది జీవవైవిధ్య సమృద్ధిని స్పష్టంగా చూపుతోంది. నదీ పర్యావరణ పరిరక్షణకు తగిన చర్యలు అవసరమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..