Viral Photo: మీకో ఛాలెంజ్.. ఈ ఫోటోలో ఎర కోసం కాపు కాసి ఉన్న పులిని మీరు కనిపెట్టగలరా..?

Viral Photo: ఇది సోషల్ మీడియా యుగం. ప్రజంట్ అన్ని జనరేషన్స్ వాళ్లు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు పజిల్స్ కూడా నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. మీ కోసం ఓ కఠినమైన ఫోటో పజిల్.

Viral Photo: మీకో ఛాలెంజ్.. ఈ ఫోటోలో ఎర కోసం కాపు కాసి ఉన్న పులిని మీరు కనిపెట్టగలరా..?
Find The Lion

Edited By: Narender Vaitla

Updated on: Jun 11, 2022 | 10:17 AM

Trending photo: లైఫ్‌లో మనకు పజిల్ లాంటి సిట్యువేషన్స్ చాలాసార్లు ఎదురవుతాయ్. అప్పుడు మనం ఎంత ఇస్మార్ట్‌గా ఆలోచించాం అనే దాన్ని బట్టి మన ఫ్యూచర్ డిపెండ్ అవుద్ది. తెలివిగా అడుగులు వేస్తే.. ప్రాబ్లమ్‌ నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. ఒక్క సరైన నిర్ణయంతో ఆనందకరమైన భవిష్యత్‌ సొంతం చేసుకోవచ్చు. అందుకు సెల్ఫ్ కాన్పిడెన్స్, ఒత్తిడిని తట్టుకునే గుణం చాలా ముఖ్యం. చిన్నవైనా, పెద్దవైనా సరే టాస్కులు సాల్వ్ చేయడానికి ఎల్లప్పుడూ రెడీగా ఉండాలి. అప్పుడే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  ఉదాహారణకు ఆదివారం వచ్చే న్యూస్ పేపర్ బుక్ చదువుతున్నప్పుడు ఏదైనా పజిల్(Puzzle)కనిపించింది అనుకోండి. దాని అంతు తేల్చే వరకు కొందరు వదిలిపెట్టరు. ఇవే కాదు.. ఈ మధ్య సోషల్ మీడియా(Social Media)లో కూడా రకరకాల పజిల్స్ ట్రెండ్ అవుతున్నాయి. అందులో ఫోటో పజిల్స్‌పై నెటిజన్ల అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది.  వీటికి సాల్వ్ చేయడం ఆషామాషీ విషయం కాదు. ఎంత సేపు చెక్ చేసినా.. మన కళ్లను మోసం చేస్తూనే ఉంటాయి. మీ ఐ పవర్ అద్భుతంగా ఉంటే వీటిని తక్కువ సమయంలోనే పరిష్కరించవచ్చు.  తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ సర్కులేట్ అవుతుంది. అది రాత్రి సమయంలో  అడవిలో తీసిన ఫోటో అని అర్థమవుతుంది. ఆ ఫోటోలో ఒక పులి దాగి ఉంది. దాన్ని కనిపెట్టడం చాలా టఫ్. ఇంకెందుకు ఆలస్యం మీరూ ట్రై చేయండి. బాగా ఫోకస్ చూస్తే దాన్ని ఈజీగా పట్టేయవచ్చు. పైపైన ఏదో రఫ్‌గా గమనిస్తే మాత్రం అది దొరకదు. ఎంత చూసినా మాకు దొరకడం లేదు బాబోయ్ అంటే దిగువన ఫోటో చూడండి.