Mysterious light in sky: రోజూలానే సాయంత్రం చికటి పడింది.. ఈ క్రమంలో ఆకాశంలో నక్షత్రాలకు బదులు.. రంగురంగులతో దూసుకెళ్తున్న ఓ ట్రైన్ లాంటి ఆకారం కనిపించింది. దీంతో జనం ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆకాశంలో ఏదో అద్భుతం జరుగుతుందంటూ అంతా రోడ్డెక్కారు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని అనేక నగరాల్లో సాయంత్రం వేళ ఆకాశంలో రంగురంగుల లైట్లు వేగంగా దూసుకళ్తున్నట్లు కనిపించడంతో అంతటా ఆసక్తి నెలకొంది. ఫరూఖాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఆకాశంలో రంగురంగుల లైట్లు.. మెరుస్తున్న నక్షత్రాల్లాంటి వస్తువు కనిపించింది. ఈ దృశ్యం చాలా సేపు ఆకాశంలో కనిపించింది. దీంతో చాలామంది రోడ్లపైకి వచ్చి మొబైల్‌లలో చిత్రీకరించారు.
ఆకాశంలో చిన్న చిన్న బల్బుల వంటి ప్రకాశవంతమైన ఓ వస్తువు వేగంగా దూసుకెళ్లడం కనిపించింది. అనంతరం దీనికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇది అమృత్‌పూర్, కంపిల్, రాజేపూర్, జిజోతా పహార్‌పూర్, హల్దీ ఖేడా, సిటీ ఏరియాతో సహా అనేక ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో కనిపించింది. ఓ ఫైటర్ ప్లేన్ వెళ్లిన తర్వాత ఆకాశంలో ఈ రంగురంగుల కాంతి కనిపించినట్లు వీడియోలో తెలుస్తోంది. రైలు ఆకారంలో లైట్లు గాలిలో కనిపించడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. అనంతరం కొద్దిసేపటికే కనుమరుగైనట్లు స్థానికులు తెలిపారు.
వీడియో చూడండి..
Friend recorded these lights in sky in #Farrukhabad #Uttarpradesh today . #India #extraterrestrial #ufosightings pic.twitter.com/mt63rLhlJI
— Pawas (@impawasmishra) September 12, 2022
కాగా, ఈ ఘటనపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ముందు ఆకాశంలో ఇలాంటి దృశ్యాన్ని చూడలేదని అంటున్నారు. కొందరు ఉల్కా అని పేర్కొంటుంటే.. మరికొందరు రాకెట్ అని చెబతున్నారు. కొంతమంది దీనిని కాన్స్టెలేషన్ అని కూడా పిలుస్తున్నారు. వాస్తవానికి ఈ కాంతి ఎందుకు ఏర్పడింది.. ఎక్కడ నుంచి వచ్చింది..? అనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి