Trillions of treasure hidden in these mysteries lake: ఉత్తర భారతంలోని హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న మిస్టీరియస్ సరస్సు గురించి తెలిస్తే ఒక్క సారిగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ సర్సులో కోట్ల విలువ చేసే నిధి ఉన్న.. ఎటువంటి సెక్యురిటీ ఉండదు. ఐనా ఆ నిధిని ఎత్తుకెళ్లడానికి ఎవ్వరూ సాహసించరు. ఎంతటి కరడుగట్టిన దొంగలైనా నిధివైపు కన్నెత్తైనా చూడరు. ఇదేదో కల్పిత కథ అని కొట్టిపారేయకండి..నిజంగానే ఉంది. అదెక్కడుందో..ఆ విశేషాలు మీకోసం..
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండీలోయలో ఉన్న మూడో ప్రధాన సరస్సుగా పేరుగాంచినది కమ్రునాగ్ సరస్సు (Kamrunag Lake). మండి జిల్లా నుంచి 60 కి.మీ దూరంలో రోహండా దట్టమైన అడవుల్లో ఈ సరస్సు ఉంది. ఈ సరస్సులోనే కోట్ల విలువచేసే నిధి దాగి ఉంది. ఇక్కడ ఇంత నిధి ఉన్నప్పటికీ దానిని బయటకు తీయడానికి మాత్రం ఎవరూ ఎందుకు సాహసించరు.నిజానికి కమ్రునాగ్ సరస్సు ఒడ్డున ఓ ప్రసిద్ధ దేవాలయం ఉంది. ఈ దేవాలయంలోని బాబా కమ్రునాగ్‌ను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఈ సరస్సులో బంగారు, వెండి, వజ్రాభరణాలు, డబ్బు వేయడమనే ఆచారం శతాబ్ధాలుగా సంప్రదాయంగా ఆచరిస్తున్నారు. ఈ సంప్రదాయం మూలంగానే ఈ సరస్సులో బిలియన్ల నిధి పోగయ్యింది. అంతేకాకుండా ప్రతి యేటా జూన్ నెల 14-15 తేదీలలో ఇక్కడ ప్రత్యేక జాతర నిర్వహించబడుతుంది. లక్షలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు.
ఐతే ఈ సరస్సులో ఉన్న నిధి దేవతలకు చెందినదని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఈ నిధికి రక్షణగా ఓ పాము కూడా ఉందని, అదే అక్కడి నిధికి కాపలాగా ఉంటుందని స్థానికులు చెబుతుంటారు. ఈ నిధిని ఎవరు బయటికి తీయాలని ప్రయత్నించినా పాము వాళ్ల ప్రాణాలను కభలిస్తుందనేది వాళ్ల నమ్మకం. అంతేకాకుండా ఈ సరస్సు నేరుగా పాతాళానికి వెళ్తుందని, అందుకే ఎవ్వరూ దీనిలోపలికి దిగే సాహసం చెయ్యరని చెబుతుంటారు. అక్కడికి వచ్చిన భక్తులు తమ కోరికలు తీరాక మొక్కుబడులు చెల్లించుకోవడానికి వచ్చి, సరస్సులో బంగారు, వెండి ఆభరణాలను సమర్పించి వెళ్తుంటారు. ఇలా అక్కడ కోట్ల విలువచేసే నిధి పోగయ్యింది.