Viral: బంగారు గనుల్లో దొరికిన వింత ఆకారం.. చెక్ చేయగా.. వెలుగులోకి సంచలన నిజం.!

|

Apr 18, 2023 | 6:45 PM

పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? అదేంటో చెప్పగలరా..! ఈ వింత ఆకారాన్ని 2018లో బంగారు గనుల్లో తవ్వకాలు జరిపిన అధికారులు లభ్యమైంది. అదేంటని శాస్తవేత్తలు పరిశోధించగా..

Viral: బంగారు గనుల్లో దొరికిన వింత ఆకారం.. చెక్ చేయగా.. వెలుగులోకి సంచలన నిజం.!
Brown Thing
Follow us on

పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? అదేంటో చెప్పగలరా..! ఈ వింత ఆకారాన్ని 2018లో బంగారు గనుల్లో తవ్వకాలు జరిపిన అధికారులు లభ్యమైంది. అదేంటని శాస్తవేత్తలు పరిశోధించగా.. సంచలన నిజం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అదేంటి.? ఆ స్టోరీ ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందామా..

వివరాల్లోకి వెళ్తే.. యుకాన్‌లోని డాసన్ సిటీ సమీపంలో ఉన్న క్లోన్‌డైక్ బంగారు గనుల్లో తవ్వకాలు జరుపుతుండగా 2018లో పురావస్తు అధికారులకు ఓ వింత ఆకారం బయటపడింది. దీనిని ల్యాబ్‌కు తీసుకెళ్లి పలు రీసెర్చ్‌లు నిర్వహించి, దానికి ఎక్స్‌రే తీయగా.. అది ఆర్కిటిక్ గ్రౌండ్ ఉడుతగా తేల్చారు. 30 వేల ఏళ్ల క్రితం నాటిదని.. అలాగే ఆ ఉడుత మరణించేనాటికి ఒక్క సంవత్సరం అయ్యి ఉండొచ్చునని అంచనా వేశారు.

ఇవి కూడా చదవండి

కాగా, అలస్కాన్ బోర్డర్ సమీపంలో ఉండే క్లోన్‌డైక్ బంగారు గనులు ఉన్న ప్రాంతమంతటా కొన్ని ఏళ్లుగా పూర్తిగా మంచుతో నిండిపోయి ఉంటుందని.. గతంలోనూ ఈ చోట వేల ఏళ్ల నాటి తోడేళ్లు, మమూత్ మృతదేహాలు దొరికాయని శాస్తవేత్తలు చెప్పుకొచ్చారు.