144 ఏళ్లనాటి పురాతనమైన అతిపెద్ద చేపల మార్కెట్..? ఇక్కడి అతి తక్కువ ధరలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. ఎక్కడంటే..

ఇక్కడ అనేక పర్యాటక ఆకర్షణలు, దేవాలయాలు, మార్కెట్లు మొదలైన వాటితో పర్యాటకులను ఆకర్షిస్తుంది. వాటితో పాటుగానే ఇక్కడ అతిపెద్ద 'చేపల మార్కెట్' కూడా ఉంది. ఇది పురాతన ఓడరేవులలో ఒకటైన సాసూన్ డాక్ పురాతనమైన, అతిపెద్ద చేపల మార్కెట్‌కు నిలయం. సాసూన్ డాక్ వద్ద అనేక రకాల చేపలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చేపలు సరసమైన ధరలకు లభిస్తాయి.

144 ఏళ్లనాటి పురాతనమైన అతిపెద్ద చేపల మార్కెట్..? ఇక్కడి అతి తక్కువ ధరలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. ఎక్కడంటే..
Sassoon Docks

Updated on: Mar 03, 2025 | 7:39 AM

చేప అనే పదం వినగానే చాలా మందికి నోరు ఊరుతుంది. చేపలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనేది అందరికీ తెలుసు. ఎన్నో పోషక విలువలతో నిండిన ఈ చేపల ఆహారం శరీరం, మెదడు, కళ్ల ఆరోగ్యం వంటి అనేక అంశాలను మెరుగుపరుస్తుంది. ఇందులో అనేక రకాల చేపలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కరికీ ఒక్కో రకం చేపలు ఇష్టం ఉంటుంది. కొందరు ఎండు చేపలు కూడా ఇష్టంగా తింటుంటారు. అయితే, అన్ని రకాల చేపలు ఒకే చోట లభించే ఒక అతిపెద్ద పురాతన మార్కెట్‌ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం.. ఇక్కద మీకు ఇష్టమైన చేపలన్నీ కూడా అతి తక్కువ, సరసమైన ధరలకే పొందుతారు. అవును, ఇక్కడ ధరలు వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎక్కడ, ఏంటో పూర్తి వివరాల్లోకి వెళితే..

144 సంవత్సరాల పురాతనమైన, అతిపెద్ద చేపల మార్కెట్‌ ఒకటి ఉందని మీకు తెలుసా..? ఇక్కడ అన్ని రకాల చేపలు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు..సరసమైన ధరలకు లభిస్తుంది. అవును, ఈ పురాతన మార్కెట్‌ ముంబైలో ఉంది. ముంబైలోని పర్యాటక ఆకర్షణలు, దేవాలయాలు, మార్కెట్లు మొదలైన వాటితో పర్యాటకులను ఆకర్షిస్తుంది. వాటితో పాటుగానే ఇక్కడ అతిపెద్ద ‘చేపల మార్కెట్’ కూడా ఉంది. ఇది పురాతన ఓడరేవులలో ఒకటైన సాసూన్ డాక్ పురాతనమైన, అతిపెద్ద చేపల మార్కెట్‌కు నిలయం. సాసూన్ డాక్ వద్ద అనేక రకాల చేపలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చేపలు సరసమైన ధరలకు లభిస్తాయి.

ఈ మార్కెట్లో మీరు ఒకేసారి ఎన్నో రకాలైన చేపలను చూడవచ్చు. సాసూన్ డాక్ ముంబైలోని అతిపెద్ద టోకు చేపల మార్కెట్. ప్రతి ఉదయం ఇక్కడ చేపలను వేలం వేస్తారు. ఇతర మార్కెట్లలో చేపలు అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. నివేదిక ప్రకారం, ప్రతిరోజూ 1,500 కంటే ఎక్కువ పడవలు 20 టన్నులకు పైగా చేపలను సాసూన్ డాక్‌కు తీసుకువస్తాయి. 144 సంవత్సరాల పురాతనమైన ఈ డాక్ వారసత్వం, ఆహారం రెండింటికీ ప్రసిద్ధి చెందిన గమ్యస్థానం. ముంబైలో సందర్శించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి సాసూన్ డాక్. సాసూన్ డాక్ కు చాలా మంది విదేశీ పర్యాటకులు కూడా చేపలు కొనడానికి వస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..