Ganpati Visarjan 2025: గణనాథులపై విమానంతో పూలవర్షం.. కిక్కిరిసిపోయిన భక్తజనం.. ఆ సీన్‌ చూడాల్సిందే..!

దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో గ‌ణ‌నాథుల నిమ‌జ్జ‌నాలు భారీ ఊరేగింపుతో నిర్వహించారు.. ప‌లువురు నిర్వాహ‌కులు అనుపోత్స‌వాన్ని వినూత్నంగా నిర్వహించారు. ముంబై లోని లాల్బాగ్ చ రాజా పండల్ నుండి వినాయకుడి విగ్రహాన్ని శోభాయాత్రలో రాఫెల్ ఫైట‌ర్ జెట్ న‌మూనా క‌లిగిన జెట్‌తో గ‌ణ‌నాథుడిపై పూల వ‌ర్షం కురిపించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది ప్రజలు రోడ్లపై చేరుకున్నారు. దీంతో పలు ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.

Ganpati Visarjan 2025: గణనాథులపై విమానంతో పూలవర్షం.. కిక్కిరిసిపోయిన భక్తజనం.. ఆ సీన్‌ చూడాల్సిందే..!
Mumbai Ganesh Visarjan

Updated on: Sep 07, 2025 | 8:46 AM

గణేష్‌ నవరాత్రులు ముగిశాయి. పది రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా గడిపిన తర్వాత శనివారం గణేశుడికి భావోద్వేగ వాతావరణంలో వీడ్కోలు పలికారు భక్తులు. దేశవ్యాప్తంగా వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఎంతో అట్టహాసంగా జరిగాయి. ఈ ఊరేగింపులో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. జై బోలో గణేష్‌ మహారాజ్‌కి జై.. గణపతి బప్పా మోరియా.. ఆగ్లే సాల్ జల్దీ ఆవో అంటూ నినాదాలు చేస్తూ ఆ గణపయ్యను గంగమ్మ ఒడికి చేరుస్తారు. ముంబైలోని లాల్బాగ్‌ చ రాజా పండల్‌ ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడి లంబోధరుడి దర్శనం కోసం ముంబైలోనే కాకుండా రాష్ట్రం, దేశం నలుమూలల నుండి భక్తులు లాల్‌బాగ్ దర్శనం కోసం క్యూ కడుతుంటారు. అలాంటి లాల్బాగ్‌ చ రాజ నిమజ్జన కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించారు.

లాల్బాగ్ చ రాజా పండల్ నుండి వినాయకుడి విగ్రహా శోభాయాత్ర భక్తజనసంద్రంగా కనిపించింది. ఈ వైభవోత్సవ యాత్రలో భక్తుల పాటలు, నృత్యాలు, కోలాహలం మధ్య ముంబై నగరం ఉత్సాహంగా నిండిపోయింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో గ‌ణ‌నాథుల నిమ‌జ్జ‌నాలు భారీ ఊరేగింపుతో నిర్వహించారు.. ప‌లువురు నిర్వాహ‌కులు అనుపోత్స‌వాన్ని వినూత్నంగా నిర్వహించారు. ముంబై లోని లాల్బాగ్ చ రాజా పండల్ నుండి వినాయకుడి విగ్రహాన్ని శోభాయాత్రలో రాఫెల్ ఫైట‌ర్ జెట్ న‌మూనా క‌లిగిన జెట్‌తో గ‌ణ‌నాథుడిపై పూల వ‌ర్షం కురిపించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది ప్రజలు రోడ్లపై చేరుకున్నారు. దీంతో పలు ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..