Viral News: గేదె పాలు ఇవ్వట్లేదని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన పాడి రైతు.. సమస్యను పరిష్కరించిన పోలీసులు.. ఎలాగంటే..
సాధారణంగా మూగజీవాలకు అనారోగ్యం వస్తే సమీపంలోని పశువుల ఆస్పత్రికో, వైద్యుడి దగ్గరకో వెళతారు. కానీ ఓ పాడి రైతు తన గేదె పాలు ఇవ్వట్లేదని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు..

సాధారణంగా మూగజీవాలకు అనారోగ్యం వస్తే సమీపంలోని పశువుల ఆస్పత్రికో, వైద్యుడి దగ్గరకో వెళతారు. కానీ ఓ పాడి రైతు తన గేదె పాలు ఇవ్వట్లేదని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తన గేదె పాలు పితకనివ్వడం లేదని, ఎవరో చేతబడి చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బాబూరామ్ జాదవ్ తన స్వగ్రామంలోనే పొలం పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు ఓ గేదె కూడా ఉంది. ఇది కొద్దిరోజుల క్రితమే ఓ దూడకు జన్మనిచ్చింది. దీంతో బాబూరామ్ రోజూ సుమారు ఐదు లీటర్ల పాలను ఆ గేదె నుంచి సేకరించి విక్రయించేవాడు. అయితే ఇటీవల ఓ శుభకార్యం నిమిత్తం రెండు రోజులపాటు పక్క ఊరికెళ్లాడు. అయితే అప్పటి నుంచే అకస్మాత్తుగా ఆ గేదె పాలు ఇవ్వడం మానేసింది. తనను పాలు పితకడానికి కూడా దగ్గరకు రానీయడం లేదు. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పి పరిష్కారం కూడా అడిగాడు. అయితే అందరూ తనను ఆటపట్టించారే తప్ప సమస్యకు పరిష్కారం చెప్పలేదు. దీంతో అతను పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు.
ఆ సూచనలు పాటించడంతో.. బాబూరామ్ సమస్యను విన్న పోలీసులు తొలుత నవ్వారు. అంతేకాకుండా అతడిని బయటకు పంపించేశారు. అయితే వెనక్కు తగ్గని ఆ రైతు సుమారు నాలుగు గంటల తర్వాత ఏకంగా గేదెతో సహా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఆ సమయంలోఓ పోలీస్ ఉన్నతాధికారి స్టేషన్‌లోనే ఉన్నాడు. బాబూరామ్ అమాయకత్వాన్ని అర్థం చేసుకుని, అతడి ఫిర్యాదును స్వీకరించాడు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న ఓ పశువుల వైద్యుడిని స్టేషన్‌కు పిలిపించాడు. గేదెను పరిశీలించిన వైద్యుడు పాలు పితికే సమయంలో పాటించాల్సిన కొన్ని మెలకువలను బాబూరామ్‌కు నేర్పించాడు. దీంతో అతడి సమస్యకు పరిష్కారం దొరికానట్లయింది. మరుసటి రోజు పాలు పితికే సమయంలో వైద్యుడు సూచనలను పాటించాడు రైతు. దీంతో మునపటిలాగానే గేదె పాలు ఇచ్చింది. దీంతో సంబరపడిపోయిన బాబూరామ్ వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తన సమస్యను పరిష్కరించినందుకు పోలీసులకు ధన్యావాదాలు తెలిపాడు.
Also Read:
Oreo Bajji Video: ఇదేం బజ్జీలురా బాబూ.. ఓరియో బిస్కెట్లతో బజ్జీలు ఎగబడి తింటున్న జనం.. వీడియో వైరల్