Viral News: కొన్ని సార్లు నిజాలను కూడా నమ్మలేం అంటే ఇదేనేమో.. అబద్దాన్ని అయినా నమ్మించొచ్చు కాని.. నిజాన్ని నమ్మడానికి టైం పడుతోంది. అలాంటి ఘటనే బ్రెజిల్ లో వెలుగుచూసింది. సాధారణంగా ఎవరైనా పిల్లలకు జన్మనిస్తే వారికి తండ్రి ఒకరే అవుతారు. కాని ఒక యువతి కవలలకు జన్మనిచ్చింది. ఆ ఇద్దరు పిల్లలకు ఇద్దరు తండ్రులు. ఒకరి తండ్రి ఒకరైతే.. మరొకరి తండ్రి ఇంకొకరు. ఇది అసాధ్యం.. నమ్మబుద్ధి కావడం లేదు కదా.. కాని అక్షరాలా ఇది నిజం.. శాస్త్రీయంగా వైద్య పరీక్షల్లో వైద్యులే ఈవిషయాన్ని స్పష్టం చేశారు. గర్భం దాల్చిన యువతి ఒకే రోజున ఇద్దరు యువకులతో శారీరకంగా కలవడంతో ఇద్దరు పిల్లలకు తండ్రులు వేరని డీఎన్ ఏ పరీక్షల్లో తేలింది.పిల్లలకు జన్మనిచ్చిన కొన్ని నెలల తర్వాత ఈవిషయం బయటకు వచ్చింది. తనకు పట్టిన పిల్లలకు అసలు తండ్రి ఎవరా అనే అనుమానం వచ్చింది. ఆకవల పిల్లలకు తండ్రిగా భావిస్తున్న వ్యక్తికి పితృత్వ పరీక్ష చేయించగా కవలల్లో ఒకరి డీఎన్‌ఏతో మాత్రమే సరిపోయింది. దీంతో పిల్లల తల్లితో పాటు వైద్యులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.
అసలు విషయం కొద్దిసేపటికి గుర్తు తెచ్చుకుంది ఆయువతి.. తాను అదే రోజు మరో యువకునితో శారీరకంగా కలిసిన విషయం చెప్పింది. దీంతో మరో యువకునికి డీఎన్‌ఏ పరీక్ష చేయించగా రెండో బాబుకు అతనే తండ్రి అని తేలింది. ఈసంఘటన చూసి వైద్యులు నివ్వెరపోయారు. ఇది అరుదైన ఘటన అని.. ఇలాంటివి 10 లక్షల్లో ఒక్క కేసులో మాత్రమే జరిగేందుకు అవకాశముంటుందని, అది కూడా చాలా కష్టమని డాక్టర్లు వెల్లడించారు. సైన్స్ ప్రకారం దీనిని హెటరో పేరెంటల్ సూపర్ ఫెకండేషన్ (బహుళ పిండోత్పత్తి)గా పిలుస్తారని వైద్యులు వెల్లడించారు. ఒకే రోజు ఇద్దరు పురుషులతో శారీరకంగా కలిసి, సదరు స్త్రీ తాలుకు రెండు అండాలు వారి వీర్య కణాలతో వేర్వేరుగా ఫలదీకరణ చెందితే ఇలా జరుగుతుందని తెలిపారు. ఫలితంగా తయారయ్యే రెండు పిండాలూ వేర్వేరు మావిలో పెరుగుతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. మనుషుల్లో అత్యంత అరుదే అయినప్పటికి.. ఇలాంటి ఘటనలు జంతువుల్లో మాత్రం సాధారణంగా జరుగుతాయని పశు వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మొత్తం మీద ఒకే గర్భంలో పుట్టిన ఇద్దరు పిల్లలకు ఇద్దరు తండ్రులు అన్న వార్త వెలుగులోకి రావడంతో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం