AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లి ప్రేమంటే ఇదే! పిల్ల ఏనుగును కాపాడబోయి కష్టాల్లో పడ్డ తల్లి ఏనుగు.. వీడియో చూస్తే కన్నీళ్లే!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో కేవలం ఒక జంతువుకు ప్రతీక కాదు, తల్లికి తన బిడ్డతో ఉన్న అవినాభావ ప్రేమ, అనుబంధానికి ప్రతీకగా నిలిచింది. తల్లి మానవుడైనా లేదా జంతువు అయినా, ఏ పరిస్థితిలోనైనా, ఆమె ఎల్లప్పుడూ తన బిడ్డ గురించి పరితపిస్తుందని నిరూపించింది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు భావోద్వేగానికి గురవుతున్నారు. 'తల్లి ప్రమే అంటే ఇదే' అని అంటున్నారు.

తల్లి ప్రేమంటే ఇదే! పిల్ల ఏనుగును కాపాడబోయి కష్టాల్లో పడ్డ తల్లి ఏనుగు.. వీడియో చూస్తే కన్నీళ్లే!
Mother Elephant Love
Balaraju Goud
|

Updated on: Sep 16, 2025 | 10:04 AM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా భావోద్వేగభరితమైన వీడియో ఒకటి వైరల్ అవుతోంది, ఇది ప్రతి ఒక్కరినీ ఆలోచించేలా చేసింది. ఈ వీడియోలో ఓ తల్లి ఏనుగు మరణం అంచున నిలబడి, చివరి శ్వాసలను లెక్కిస్తోంది. కానీ, అది తన బిడ్డ గురించి పరితపించిపోయింది. ఈ దృశ్యం చూసిన జనాలను కదిలించింది. తల్లి మానవుడైనా లేదా జంతువు అయినా, ఏ పరిస్థితిలోనైనా, ఆమె ఎల్లప్పుడూ తన బిడ్డ గురించి ఆందోళన చెందుతుందని నిరూపించింది. అందుకే తల్లి ప్రేమ ఎల్లప్పుడూ అమరమని అంటారు.

ఒక తల్లి ఏనుగు భూమిలో కూరుక్కుపోయింది. అది చాలా బలహీనంగా, నిస్సహాయంగా ఉండిపోయింది. తన జీవితం ఎక్కువ కాలం ఉండదని స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఈ పరిస్థితిలో కూడా, తనను తాను మరచిపోయి తన బిడ్డ గురించి చింతించడం ప్రారంభించింది. పిల్ల ఏనుగును తన తొండంతో చుట్టేసుకుంది. పిల్ల ఏనుగు కూడా లేవలేక పోవడంతో, తల్లి ఏనుగు దాని గురించి మరింత ఆందోళన చెందింది. తన పిల్లను ఎలాగైనా రక్షించాలనుకుంది. తన బిడ్డతో ‘చింతించకు, నేను ఇక్కడ ఉన్నాను’ అని చెబుతున్నట్లు అనిపించింది. ఈ దృశ్యం అందరి హృదయాలను కదిలించి వేసింది. ఈ వీడియో చూసిన ప్రేక్షకుల కళ్ళు తడిసిపోయాయి. అయితే, మంచి విషయం ఏమిటంటే ఏనుగు తోపాటు దాని బిడ్డ పిల్ల ఏనుగును స్థానికులు రక్షించారు.

వీడియో చూడండి.. 

ఈ హృదయ విదారక వీడియోను wildfriends_africa అనే ID ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.’ఈ ధైర్యవంతురాలైన తల్లి ఏనుగు జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ఆశాకిరణంగా నిలిచింది. తన ప్రాణాలను పణంగా పెట్టి, ఒక ఆడ ఏనుగు తన బిడ్డకు పూర్తిగా రక్షించుకునే ప్రయత్నిం చేసింది. భుజాల వరకు బురదలో కూరుక్కుపోయి బయటకు రాలేక తన బిడ్డ గురించి ఆందోళన చెందింది. అచంచలమైన తల్లి ప్రేమకు మీరు కూడా భావోద్వేగానికి లోనవుతారు. తరువాత, దాన్ని రక్షించి బురద నుండి బయటకు తీశారు. ఏనుగు తెలివితేటలు, భావోద్వేగాల ప్రదర్శన వర్ణించడానికి మా దగ్గర పదాలు లేవు.’ అంటూ ఒక్కొక్క నెటిజన్ రకరకాలుగా తమ స్పందనలు తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..