Viral Video: అది చెయ్యా.. సుత్తా..? పిడికిలిలో గుడ్డు పగలకుండా ఇది ఎలా సాధ్యం స్వామి

ఒక మనిషి ప్రాచూర్యం పొందాలంటే అతడిలో ఏదైనా స్పెషాలటీ ఉండాలి. బుద్ది బలం లేదా కండబలంతో నెగ్గుకురావాలి. కొంత మంది డిఫరెంట్ టెక్నిక్స్..

Viral Video: అది చెయ్యా.. సుత్తా..? పిడికిలిలో గుడ్డు పగలకుండా ఇది ఎలా సాధ్యం స్వామి
Crushing Most Drinks Cans

Updated on: Jul 30, 2021 | 11:36 AM

ఒక మనిషి ప్రాచూర్యం పొందాలంటే అతడిలో ఏదైనా స్పెషాలటీ ఉండాలి. బుద్ది బలం లేదా కండబలంతో నెగ్గుకురావాలి. కొంత మంది డిఫరెంట్ టెక్నిక్స్ ఉపయోగించి కూడా ఫేమస్ అవుతారు. ఒక వ్యక్తి తాజాగా తన ఉక్కు పిడికిలితో అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అవును కేరళకు చెందిన కేఆర్ జాన్ పాల్ అనే వ్యక్తి ఈ అరుదైన రికార్డు సృష్టించాడు. అతను కేవలం ఒకే ఒక్క దెబ్బతో కూల్ డ్రింక్ డబ్బాను పగలగొట్టాడు. అలా ఒక్కటి కాదు.. 30 సెకన్లలో మొత్తం 52 డబ్బాలను బద్దలు కొట్టిన జాన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. కాగా ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే కూల్ డ్రింక్ డబ్బాలను బద్దలు కొడుతున్న సమయంలో అతడితో చేతి కోడి గుడ్డు ఉంటుంది. పిడికిలిలో ఉన్న కోడి గుడ్డు పగిలిపోకుండా.. అతడు కూల్ డ్రింక్ క్యాన్లను క్రష్ చేసేశాడు. దీంతో అతడి చేతులు సుత్తి కంటే బలమైనవి అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అతని రికార్డ్ బ్రేక్ చెయ్యడం అంత ఈజీ టాస్క్ కాదని చెబుతున్నారు. జాన్ పాల్ మెరుపు వేగంతో కూల్ డ్రింక్ డబ్బాలను బద్దలు కొడుతున్న వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

వీడియో వీక్షించండి

సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రజలు చాలా లైక్స్ చేస్తున్నారు. షేర్స్ చేయడమే కాకుండా అతడి కండబలంపై, టెక్నిక్‌పై వివిధ రకాల కామెంట్స్ పెడుతున్నారు. నార్మల్‌గా డబ్బాలను బద్దలు కొట్టేవారు ఉంటారు కానీ.. చేతిలో పట్టుకున్న గుడ్డు పగిలిపోకుండా ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:వామ్మో..! ఈ మొక్క పురుగులను తినేస్తుంది.. వీడియో చూస్తే షాకవుతారు

‘మంచి చేయడమే తప్పైంది’.. ఇంటికి పిలిచి బట్టలిప్పి మరీ చితకబాదాడు