Viral Video: మీరు గ్యాంగ్ వార్ చూశారా? పోనీ.. గ్యాంగ్ వార్ గురించి విన్నారా? చూడకపోయినా.. విని ఉంటారు లేండి. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే ప్రపంచానికి తెలిసిపోతోంది. అయితే, గ్యాంగ్ వార్ అంటే జనరల్‌గా మనుషుల మధ్య జరుగుతుందని అంతా భావిస్తుంటారు. మరి జంతువుల మధ్య కూడా గ్యాంగ్ జరుగుతుందని మీకు తెలుసా? వాటి ఫైటింగ్ మనుషుల కంటే కూడా భీకరంగా ఉంటాయని మీకు తెలుసా? తెలియకపోతే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసేయండి.
కోతి చేష్టలు ఎంత దారుణంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. దానికి చిర్రెత్తిందంటే.. ఇక అంతేసంగతులు. అందుకే మనుషులెవరూ దాని జోలికి వెళ్లేందుకు సాహసించరు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. మూడు కోతి నాయకులకు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. తమ సైన్యాన్ని వెంటేసుకుని పోరాటానికి సై అన్నాయి. నడి రోడ్డుపై పోరాటానికి దిగి.. జనాలను హడలెత్తించాయి. ఈ ఘటన థాయ్‌లాండ్‌లోని ఫ్రే ప్రాంగ్ సం యోద్‌లోని లోప్‌బూరి ఫ్రా కాన్ టెంపుల్ సమీపంలో చోటు చేసుకుంది. అటు వైపు టెంపుల్… ఇటువైపు ప్రభుత్వ సేవింగ్స్ బ్యాంక్, మరోవైపు మార్కెట్ ఉంది. ఈ రద్దీ కూడలిలో పెద్ద సంఖ్యలో కోతులు ఉన్నాయి. అయితే, ఒక్కసారిగా ఏమైందో ఏమా గానీ.. మూడు గ్యాంగ్‌లుగా వచ్చిన కోతులు.. మూకుమ్మడిగా దాడి చేసుకున్నాయి. ఒక రేంజ్‌లో కొట్టుకున్నాయి. ఈ కోతుల గ్యాంగ్ వార్ చూసి జనాల్ హడలిపోయారు.
సాధారణంగా కోతులు ఆహారం కోసం పోట్లాడుకోవడం చూశాం. కానీ, అలాంటి కారణం లేకుండానే.. ఏకంగా భారీ సంఖ్యలో ఒక్క చోటకి చేరిన మూడు గ్యాంగ్‌ల కోతులు ఇలా కొట్టుకోవడం అందరినీ షాక్‌కు గురి చేశాయి. ఈ వార్‌లో చాలా కోతులు తీవ్రంగా గాయపడ్డాయి. అలా చాలాసేపు కొట్టుకున్న తరువాత.. ఒక కోతి వెనక్కి తగ్గింది. దానివెంటనే మిగతా కోతులు వెనక్కి తగ్గాయి. దాంతో అక్కడ శాంతి నెలకొంది. కాగా, కోతుల గ్యాంగ్‌వార్‌ను వీడియో తీసిన అక్కడి వ్యక్తులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదేం గ్యాంగ్ వార్ బాబు అంటూ స్టన్ అవుతున్నారు.
Also read:
India Bangladesh Train: భారత్-బంగ్లా సరిహద్దుల్లో చారిత్రాత్మక ఘట్టం.. 56 ఏళ్ల క్రితం నిలిచిపోయిన..
TS Weather Alert: తెలంగాణలో చలిగాలులు.. రాగల మూడు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్..
Central Govt Scheme: మీరు పాడి రైతులా?.. అయితే రూ. 5 లక్షలను పొందండి.. పూర్తి వివరాలు మీ కోసం..