మానవులు ఈ భూమిపై అత్యంత తెలివైన జీవులుగా పరిగణించబడుతున్నప్పటికీ.. కొన్నిసార్లు కొన్ని జంతువుల తెలివితేటలు , సామజిక సృహ చూస్తే మనుషులు వీటి ముందు ఎందుకు పనికి వస్తారు అని పిస్తుంది కూడా.. కొన్ని జంతువులు చేసే పనులు చూసిన తర్వాత ప్రజలు కూడా గందరగోళానికి గురవుతారు. ప్రస్తుతం, అటువంటి జంతువు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఖచ్చితంగా ఎవరి హృదయానికి అయినా సంతోషాన్ని ఇస్తుంది. వాస్తవానికి ఈ వీడియో ఒక కోతికి సంబంధించినది. ఆ కోతి కుళాయిని తెరిచి నీరు త్రాగుతూ కనిపించింది. దీని నుంచి మనుషులు కూడా నేర్చుకోవాలి.
చిన్నతనంలో ‘నీరే ప్రాణం’ అని పుస్తకాల్లో చదివి ఉంటారు. నీరు లేకుండా మానవులు లేదా ఏ జీవి ఉనికి సాధ్యం కాదు. ఈ విషయం అందరికీ తెలిసిందే.. అయినప్పటికీ చాలా మంది ఆలోచించకుండా నీటిని వృధా చేస్తారు. నీటి ప్రాముఖ్యత, మానవ జీవితానికి ఎంత ముఖ్యమో అసలు గుర్తించరు. అయితే ఈ కోతికి నీటి విలువ తెలుసు. రోడ్డుపక్కన అమర్చిన కుళాయిలోంచి నీటిని తాగుతున్న కోతి ఆ నీటిని తాగగానే కుళాయి నుంచి నీరు వృధా పోకుండా టాప్ ను సరిగ్గా మూసేసింది. నీరు వృథా కాకుండా కోతి చేసిన పని వీడియోలో చూడవచ్చు. కోతి తెలివితేటలు ప్రజలను ఆశ్చర్యపరిచాయి. ఆనందపరిచాయి.
शिक्षाप्रद संदेश…👌
पानी की हर बूंद कीमती है, इसे बर्बाद न करें ..!
💞#DontWasteWater 💦 pic.twitter.com/cHG6egpzHp— Sanjay Kumar, Dy. Collector (@dc_sanjay_jas) May 14, 2024
ఈ హృదయాన్ని హత్తుకునే వీడియోను జార్ఖండ్ డిప్యూటీ కలెక్టర్ సంజయ్ కుమార్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. ‘విద్యా సందేశం’ అనే క్యాప్షన్ ఇచ్చారు ఈ వీడియోకు. ప్రతి నీటి బొట్టు అమూల్యమైనది. దానిని వృధా చేయవద్దు. కేవలం 11 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 13 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను కూడా లైక్ చేశారు.
అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ఒకరు ‘నీరు అంటే ప్రాణం.. ఈ విషయాన్నీ మనుషుల కంటే జంతువులే ఎక్కువగా అర్థం చేసుకున్నట్లు ఉన్నాయి ‘ అని రాశారు, మరొక వినియోగదారు ‘జంతువులకు సామజిక సృహ, ప్రకృతి పరిరక్షణ ఎక్కువ. మానవులు మాత్రం ఈ విషయాన్నీ అర్థం చేసుకోరు’ అని రాశారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..