కోతులు చేసే అల్లరి చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవి చేసే పనులు చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే..మనుషులైన.. ఇతర జంతువులైన.. భయపడకుండా ఆట పట్టిస్తాయి.. ఇటీవల కోతులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని భయం కలిగిస్తే మరి కొన్ని తెగ నవ్వు తెప్పిస్తాయి. ఇక కోతులకు సంబంధించిన వీడియాలు సోషల్ మీడియాలో కోకొల్లలు… ఇక మనుషుల మాదిరిగానే జంతువులకు ఫీలింగ్స్ ఉంటాయి. అవి కూడా మనలనే భాదపడతాయి, సంతోషిస్తాయి, ప్రేమిస్తాయి, స్నేహం చేస్తాయి. తాజాగా ఓ కోతి వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అందులో ఆ కోతి చేసే పని చూస్తే నవ్వకుండా ఉండలేరు..
సాధారణంగా కోతులను కొందరు మనుషులు పెంచుకుంటుంటారు.. వాటిని ఆడిస్తూ.. జీవనోపాధిని పొందుతారు.. కోతి ఆటనే వారి ఆకలి తీరుస్తుంది.. కోతుల ఆడిస్తూ… ఇతర పట్టణాలు.. నగరాలు సంచరిస్తుంటారు.. అయితే ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ యాజమాని…తన కోతితో కలిసి ఓ షాప్లో కూర్చున్నాడు.. అయితే అతను బల్లపై కూర్చోగా.. అతని కోతి బన్ తింటూ కింద కూర్చుంది. అయితే ఆ యాజమాని కోతిని ఆటపట్టిస్తూ… తలపై కొడుతాడు. వెంటనే కోతి పక్కనే ఉన్న అద్దంలో తనను తాను చూసుకుంటూ మరో కోతి తనను కోతి కొట్టిందనుకుని అద్దంపై దాడి చేస్తుంది. ఇలా రెండు సార్లు కోతిని ఆటపట్టిస్తాడు ఆ యాజమాని. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది.
Also Read: Babu Mohan: ఆవేశం తగ్గించండి.. ప్రతి సభ్యుడికి విష్ణు అధ్యక్షుడే.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు..
Manchu Vishnu: మంచు విష్ణు సంచలన ప్రెస్‌మీట్.. పవన్, చిరంజీవి సహా కీలక విషయాలపై కామెంట్స్