Watch: భారీ వర్షాలకు ఎయిర్‌పోర్ట్‌లో కూలిన రూఫ్‌..! భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు..

ఇదిలా ఉంటే, భారీ వర్షం, తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా 49 విమానాలను దారి మళ్లించారు. మే 24న తెల్లవారుజామున 2 గంటలకు, 30-45 నిమిషాల పాటు గంటకు 70-80 కి.మీ వేగంతో గాలులు వీచాయి. 80 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Watch: భారీ వర్షాలకు ఎయిర్‌పోర్ట్‌లో కూలిన రూఫ్‌..! భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు..
Delhi Airport Rooftop Accident

Updated on: May 25, 2025 | 7:49 PM

దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1పైకప్పులో కొంత భాగం కూలిపోయింది. మే 25 ఆదివారం కురిసిన భారీ వర్షం కారణంగా రూఫ్‌ కొంత భాగం కూలిపోయింది. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం తెల్లవారుజామున వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో టెర్మినల్-1 వద్ద టెంట్ ఆకారంలోని రూఫ్‌లోకి వర్షపు నీరు చేరి కొంత భాగం కూలిపోయింది. వర్షాల కారణంగా దాదాపు 49 విమానాలను దారి మళ్లించారు. ఢిల్లీ విమానాశ్రయంలో కార్యకలాపాలకు కొంత అంతరాయం ఏర్పడింది. దేశ రాజధానిలోని అనేక ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

భారత వాతావరణ శాఖ శనివారం ఢిల్లీ, పరిసర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫానులు, భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. గత సంవత్సరం ఇలాంటి సంఘటనలో ఒకరు మరణించారు. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో విమర్శలకు దారితీసింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి…

ఇదిలా ఉంటే, భారీ వర్షం, తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా 49 విమానాలను దారి మళ్లించారు. మే 24న తెల్లవారుజామున 2 గంటలకు, 30-45 నిమిషాల పాటు గంటకు 70-80 కి.మీ వేగంతో గాలులు వీచాయి. 80 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..