ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్‌ ఆర్డర్‌ చేసిన వ్యక్తి.. పార్శిల్‌ తెరిచి చూడగా ఇంటిని చుట్టుముట్టిన ఆర్మీ..!

|

Sep 02, 2023 | 7:11 PM

పార్శిల్ ఓపెన్ చేసిన ఆ వ్యక్తి భయంతో అతడు వణికిపోయాడు. వెంటనే పోలీసులకు కాల్‌ చేసిన సమాచారం ఇచ్చాడు. అలాగే సంబంధిత అధికారులకు కాల్ చేసి విషయం చెప్పాడు. ఆ తర్వాత బాంబు నిర్వీర్య స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుంది..ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇంతలోనే ఆ దేశ రక్షణ శాఖ అధికారులు కూడా ఆ వ్యక్తి ఇంటిని చుట్టుముట్టేశారు.

ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్‌ ఆర్డర్‌ చేసిన వ్యక్తి.. పార్శిల్‌ తెరిచి చూడగా ఇంటిని చుట్టుముట్టిన ఆర్మీ..!
Online Shopping
Follow us on

ఇప్పుడు అంతా ఆన్‌లైన్ షాపింగ్ యుగం నడుస్తోంది. ఏదైనా కొనుగోలు చేయడానికి పనిగట్టుకుని మార్కెట్‌కో, లేదంటే షాపింగ్‌ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా..ఇంట్లో కూర్చుని, హాయిగా టీవి చూస్తూ కూడా.. నేరుగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటున్నారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే కావాల్సిన వస్తువులు వారి ఇళ్లకు చేరుకుంటాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ షాపింగ్‌లలో ప్రజలు ఎక్కువగా ఆఫర్ల పేరిట ఎలక్ట్రానిక్‌ పరికరాలు, మొబైల్ ఫోన్‌లను కొనుగోలు చేస్తుంటారు. ఈ సందర్బాల్లో అప్పుడప్పుడు ఆన్‌లైన్ మోసాలు కూడా వెలుగులోకి వస్తుంటాయి. కొందరు ఆన్‌లైన్‌లో ఖరీదైన మొబైల్‌ కొంటే..వారికి వచ్చిన పార్శిల్‌లో బంగాళదుంపలు, ఉల్లిపాయలు, ఇటుక-రాయి వంటివి కూడా వచ్చిన సందర్భాలు గతంలో చూశాం. అలాగే కొందరికీ అతి తక్కువ ధరతో కొన్న వస్తువులకు బదులుగా ఖరీదైన వస్తువులు డెలివరీ అయిన సంఘటనలు కూడా అప్పడప్పుడు చూశాం. ఇక్కడ కూడా అలాంటి సంఘటన జరిగింది.

ఆన్‌లైన్‌లో మొబైల్ ఫోన్‌ని ఆర్డర్ చేసి వ్యక్తికి షాకింగ్‌ వస్తువు డెలివరీ అయింది. అతడు మొబైల్‌ ఫోన్‌ ఆర్డర్‌ చేస్తే.. దానికి బదులుగా పార్శిల్‌లో బాంబు ప్రత్యక్షమైంది. అవును, ఇది వింతగా అనిపించవచ్చు.. కానీ మెక్సికోలో జరిగిన ఈ సంఘటన అందరినీ షాక్‌ అయ్యేలా చేసింది. స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేసిన వ్యక్తికి పార్శిల్ లో ఫోన్‌కు బదులు బాంబు రావడం ఏంటని అందరూ అవాక్కయ్యారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, గుర్తు తెలియని కస్టమర్ తన ఇంటి కోసం ఆన్‌లైన్ స్టోర్ నుండి స్మార్ట్‌ఫోన్‌ను ఆర్డర్ చేసినట్లు పేర్కొంది. అయితే పార్శిల్‌లో అతనికి హ్యాండ్ గ్రెనేడ్ వచ్చింది.

అతడు ఆర్డర్‌ చేసిన పార్శిల్‌ ప్యాకేజీ సోమవారం ఆ వ్యక్తి ఇంటికి చేరుకుంది. అతని తల్లి ఆ పార్శిల్‌ తీసుకుని ఇంట్లో డైనింగ్‌ టేబుల్‌పై ఉంచింది. నిజానికి అందులో బాంబు ఉందన్న విషయం ఆమెకు తెలియదు. ఆ వ్యక్తి ఇంటికి వచ్చాక పార్శిల్ తెరిచి చూడగా అందులో హ్యాండ్ గ్రెనేడ్ బాంబు ఉండడంతో ఒక్కసారిగా షాక్ తిన్నాడు. భయంతో అతడు వణికిపోయాడు. వెంటనే పోలీసులకు కాల్‌ చేసిన సమాచారం ఇచ్చాడు. అలాగే సంబంధిత అధికారులకు కాల్ చేసి విషయం చెప్పాడు. ఆ తర్వాత బాంబు నిర్వీర్య స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుంది..ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇంతలోనే ఆ దేశ రక్షణ శాఖ అధికారులు కూడా ఆ వ్యక్తి ఇంటిని చుట్టుముట్టేశారు.

ఇవి కూడా చదవండి

సదరు వ్యక్తి ఇంటికి చేరుకున్న ఆర్మీ సిబ్బంది హ్యాండ్ గ్రెనేడ్‌ను నిర్వీర్యం చేశారు. దీంతో ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం అధికారులు ఆ వింత ప్యాకేజీని స్వాదీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. అయితే, ఆ వ్యక్తి ఇంటికి ఎవరు గ్రెనేడ్ పంపారనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అతను ఫోన్‌ను ఆర్డర్ చేసిన కంపెనీ పేరును కూడా వెల్లడించలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..