దూడగారి వింత బాగోతం చూడాల్సిందే..

|

May 03, 2019 | 12:18 PM

వేలూరు: తమిళనాడులోని వేలూరు జిల్లా ఆంబూరు సమీపంలో ఒక దూడ వింతగా ప్రవర్తిస్తోంది.  అచ్చం మనిషిలా ప్రవర్తిస్తూ అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వీరాకుప్పంకి చెందిన ఆనందన్ ఇంట్లోని ఆవుకు ఈమధ్యే మగ దూడ పుట్టింది. అది రోజూ ఇంటిలోని వారు తాగే మంచినీటిని మాత్రమే తాగుతోంది. పైగా మనుషులు పడుకునే చోటికి వచ్చి, చాప, దిండు ఉన్న చోట మాత్రమే పడుకుంటోంది. అది కూడా మనిషిలా నిద్రపోతోంది. మామూలుగా ఆవులు చిరుతిళ్ల వంటివి తినవు. ఈ లేగ […]

దూడగారి వింత బాగోతం చూడాల్సిందే..
Follow us on

వేలూరు: తమిళనాడులోని వేలూరు జిల్లా ఆంబూరు సమీపంలో ఒక దూడ వింతగా ప్రవర్తిస్తోంది.  అచ్చం మనిషిలా ప్రవర్తిస్తూ అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వీరాకుప్పంకి చెందిన ఆనందన్ ఇంట్లోని ఆవుకు ఈమధ్యే మగ దూడ పుట్టింది. అది రోజూ ఇంటిలోని వారు తాగే మంచినీటిని మాత్రమే తాగుతోంది. పైగా మనుషులు పడుకునే చోటికి వచ్చి, చాప, దిండు ఉన్న చోట మాత్రమే పడుకుంటోంది. అది కూడా మనిషిలా నిద్రపోతోంది. మామూలుగా ఆవులు చిరుతిళ్ల వంటివి తినవు. ఈ లేగ దూడ మాత్రం…ఆ ఇంట్లో పిల్లలతో పాటుగా చిరుతిళ్లు తినేస్తోంది. అంతేకాదు దీని  కోసం ఇంటిలోని వారు లౌడ్ స్పీకర్లు పెట్టి మ్యూజిక్ కూడా అరెంజ్ చేయడంతో.. పాటలు విని సంగీతానికి తగ్గట్లు అది నాట్యం చేస్తూ పలువురిని ఆకట్టుకుంటోంది.  ఆకలేసినప్పుడు తల్లి ఆవు దగ్గరకు వెళ్లి పాలు తాగడం మినహా… మిగతా టైమంతా ఇంట్లో వాళ్లతో గడిస్తోంది ఈ బుజ్జి దూడ. ఈ విషయం చుట్టుపక్కల వాళ్లకు తెలియడంతో అందరూ తండోపతండాలుగా వచ్చి..ఈ దూడ వింత ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రేజీ దూడతో ఓ సెల్పీ తీసుకుని ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో   పోస్ట్ కూడా చేసేస్తున్నారు.