పైన ఫోటోలో ఉన్న ఈ క్యూట్ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టండి. అమ్మాయి అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆ ఫోటోలో తన తల్లితో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరో. తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈహీరో.. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. గత కొద్ది రోజులుగా ఈ హీరో నుంచి ఎలాంటి సినిమా అప్డేట్ లేదు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఇంతకీ గుర్తుపట్టారా ఎవరో..
పైన వాళ్ల మథర్తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చిన ఈ క్యూట్ లిటిల్ బుజ్జాయి మరెవరో కాదు.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు అయిన తేజ్.. పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతో హిట్ అందుకున్న ఈ హీరో.. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, తిక్క, ప్రతిరోజూ పండగే వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. చివరగా తేజ్ రిపబ్లిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే గతేడాది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తేజ్.. ఇప్పుడు పూర్తిగా కోలుకుని తన తదుపరి సినిమా చిత్రీకరణలో పాల్గోంటున్నారు. తాజాగా తేజ్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.