Mcdonald’s: ఇలా అయితే ఉద్యోగుల పరిస్థితి ఎలా బాస్‌.. ఈ రెస్టారెంట్ చూస్తే మీరూ ఇదే అంటారు.

|

Jan 31, 2023 | 6:07 PM

ఓవైపు ఉద్యోగుల తొలగింపు ప్రపంచాన్ని భయపెడుతోంది. ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ఉద్యోగులకు పీడ కలల్ని మిగిలిస్తోంది. అయితే ఉద్యోగులకు కేవలం ఆర్థిక మాంద్యం మాత్రమే కాకుండా ఆటోమేషన్‌ అనే మరో ముప్పు పొంచి ఉంది. ఉద్యోగులు చేసే అన్ని పనులను రోబోలు చేసే కాలం వచ్చేసింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌...

Mcdonalds: ఇలా అయితే ఉద్యోగుల పరిస్థితి ఎలా బాస్‌.. ఈ రెస్టారెంట్ చూస్తే మీరూ ఇదే అంటారు.
Mcdonald's
Follow us on

ఓవైపు ఉద్యోగుల తొలగింపు ప్రపంచాన్ని భయపెడుతోంది. ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ఉద్యోగులకు పీడ కలల్ని మిగిలిస్తోంది. అయితే ఉద్యోగులకు కేవలం ఆర్థిక మాంద్యం మాత్రమే కాకుండా ఆటోమేషన్‌ అనే మరో ముప్పు పొంచి ఉంది. ఉద్యోగులు చేసే అన్ని పనులను రోబోలు చేసే కాలం వచ్చేసింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం పెరగడంతో కంపెనీలు ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నాయి. దీంతో ఉద్యోగుల సంఖ్యను కంపెనీలు తగ్గించుకుంటూ వస్తున్నాయి. అయితే తాజాగా ఓ వీడియో ఆర్టిఫిషియల్‌ ఎంత ప్రమాదకరమే చెబుతోంది. ప్రముఖ ఫుడ్‌ రెస్టారెంట్‌ కంపెనీ మెక్‌డొనాల్డ్స్‌ అమలు చేస్తున్న విధానం భవిష్యత్తులో ఉద్యోగుల పరిస్థితిని ప్రశ్నార్థకంగా మార్చేస్తోంది.

అమెరికాలోని టెక్సాస్‌లో ఉద్యోగులతో పనిలేకుండా రోబోలతో నడిచే రెస్టారెంట్‌ను మెక్‌డొనాల్డ్స్‌ ప్రారంభించింది. గతేడాది డిసెంబర్‌లో ప్రారంభించిన ఓ రెస్టారెంట్‌లో సర్వర్‌లు మొదలు, క్యాషియర్‌ వరకు అసలు ఉద్యోగి అనే వాళ్లే ఉండరు. ఆహారం త‌యారుచేయ‌డం ద‌గ్గ‌ర నుంచి స‌ర్వ్ చేయ‌డం వ‌ర‌కూ రోబోలే అన్నీ చేసేస్తాయి. మెక్‌డొనాల్డ్స్ ప్ర‌యోగాత్మ‌కంగా ఈ రెస్టారెంట్‌ను ఓపెన్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే కన్‌సానిటీ అనే నెటిజన్‌ మెక్‌డొనాల్డ్స్‌ రెస్టారెంట్‌ను సందర్శించిన తన అనుభవాలను వీడియో రూపంలో పంచుకున్నారు. ఈ వీడియోలో ఉద్యోగులు లేకుండా రెస్టారెంట్ ఎలా నడుస్తుందో చక్కగా చూపించారు. ఆర్డర్‌ మొదలు, పేమెంట్‌ వరకు అన్నీ రెండో వ్యక్తి ప్రమోయం లేకుండానే జరిగిపోతున్నాయి. అలానే కన్‌సానిటీ ఓ బర్గర్‌ను ఆర్డర్‌ చేశాడు. ఇదిలా ఉంటే ఈ రెస్టారెంట్‌లో టేక్‌ అవే విధానాన్ని మాత్రమే అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెస్టారెంట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన కొందరు కొత్త టెక్నాలజీ సూపర్‌ అంటుంటే మరికొందరు మాత్రం భవిష్యత్తులో ఉద్యోగుల పరిస్థితి ఏంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..