Viral Video: భోజనం చేస్తున్నప్పుడు మాస్క్‌ ఎందుకు పెట్టుకోలేదని వృద్ధుడిని చితక బాదిన మహిళ.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

|

Dec 29, 2021 | 10:10 AM

కరోనా మహమ్మారి ప్రభావంతో అందరి జీవితాల్లో మాస్క్ ఒక భాగమైపోయింది. ఎక్కడికెళ్లినా ముఖానికి ఫేస్‌ మాస్క్‌ ఉండాల్సిందే. ఈక్రమంలో మాస్క్ ధరించనివారిని విమానాల్లో నుంచి బయటకు

Viral Video: భోజనం చేస్తున్నప్పుడు మాస్క్‌ ఎందుకు పెట్టుకోలేదని వృద్ధుడిని చితక బాదిన మహిళ.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..
Follow us on

కరోనా మహమ్మారి ప్రభావంతో అందరి జీవితాల్లో మాస్క్ ఒక భాగమైపోయింది. ఎక్కడికెళ్లినా ముఖానికి ఫేస్‌ మాస్క్‌ ఉండాల్సిందే. ఈక్రమంలో మాస్క్ ధరించనివారిని విమానాల్లో నుంచి బయటకు పంపించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇది ఒక రకంగా మంచిదే అయినా కొందరు మాత్రం శ్రుతిమించి వ్యవహరిస్తున్నారు. తమ వికృత ప్రవర్తనతో తోటివారిని ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఒక మహిళ తింటున్నప్పుడు మాస్‌ ఎందుకు ధరించలేదని ఒక 80 ఏళ్ల వృద్ధుడిపై విచక్షణా రహితంగా దాడిచేసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ మహిళ కూడా మాస్క్‌ ధరించకపోవడం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానలో ప్రయాణిస్తున్న ఓ మహిళ వెనక సీటులో కూర్చొన్న ఓ వృద్ధుడి దగ్గరకు వెళుతుంది. ఆ సమయంలో ఆయన భోజనం చేస్తుంటాడు. అయితే కాసింతైనా విచక్షణా జ్ఞానం లేని ఆ సదరు మహిళ మాస్క్‌ ఎందుకు ధరించడం లేదని వృద్ధుడితో గొడపవడుతుంది. అమానుషంగా తిట్టి దాడికి పాల్పడుతుంది. పక్కనున్న వాళ్లు వారిస్తున్నా వినిపించకుండా అలాగే వృద్ధుడిని కొడుతుంది. ఇక్కడ షాకింగ్‌ విషయమేమిటంటే.. ఆ సదరు మహిళ కూడా మాస్క్‌ ధరించలేదు. కాగా ఈ గొడవ గురించి తెలుసుకున్న విమాన సిబ్బంది ఆమెను అడ్డుకుని అక్కడ నుంచి తీసుకువెళ్తారు. కాగా విమానం అట్లాంటాలో ల్యాండ్‌ అవ్వగానే అక్కడి ఎఫ్‌బీఐ అధికారులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా మహిళ పేరు ప్యాట్రిసియా కార్న్‌వాల్‌గా గుర్తించారు. ఈ సంఘటనపై స్పందించిన డెల్టా ఎయిర్‌లైన్స్‌.. ‘విమానంలో అందరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాల్సిందే. అంతమాత్రాన ఇలాంటి వికృత ప్రవర్తనను మాత్రం సహించేది లేదు’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

Also Read:

David Warner: చాలా రోజుల తర్వాత వార్నర్‌ గురించి ట్వీట్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌.. ఇంతకీ అందులో ఏముందంటే..

Treadmill Walk: ట్రెడ్‌మిల్‌ మీద12 గంటలు.. 66 కిలోమీటర్ల నడక.. మొరాదాబాద్‌ ఎక్స్‌ ప్రెస్‌ మరో అరుదైన ఘనత..

Chennai: రేపటి నుంచి చెన్నై ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌.. ప్రదర్శితం కానున్న 60 దేశాల సినిమాలు..