Viral: భార్య కనిపించట్లేదంటూ పోలీస్ కంప్లయింట్.. సీన్ కట్ చేస్తే.. విచారణలో స్టన్నింగ్ నిజం..

|

Jul 28, 2022 | 12:36 PM

తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య, బిడ్డ అదృశ్యమవ్వడంతో భర్త పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు. అతడి ఫిర్యాదు..

Viral: భార్య కనిపించట్లేదంటూ పోలీస్ కంప్లయింట్.. సీన్ కట్ చేస్తే.. విచారణలో స్టన్నింగ్ నిజం..
Marriage Woman Eloped
Follow us on

తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య, బిడ్డ అదృశ్యమవ్వడంతో భర్త పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు. అతడి ఫిర్యాదు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులకు స్టన్నింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో దెబ్బకు అటు భర్త.. ఇటు పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతకీ అసలేం జరిగింది.? ఆ కథేంటి.?

వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌కు చెందిన ఓ యువకుడు రెండేళ్ల కిందట సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువతిని ప్రేమించి పెళ్ళాడాడు. వారిద్దరి ప్రేమకు గుర్తుగా ఓ ఆడపిల్ల జన్మించింది. ఇంతవరకు బాగానే ఉంది. వారి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. అయితే కొద్దిరోజుల కిందట ఆ యువతికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 20 ఏళ్ల యువకుడు పరిచయం ఏర్పడింది. దీంతో సదరు యువతి అతడితో మళ్లీ ప్రేమలో పడింది. అంతే! భర్తకు కూడా చెప్పకుండా కూతురిని తీసుకుని ఆ యువకుడిని కలిసేందుకు వెళ్ళిపోయింది.

ఇక ఈ వ్యవహారాన్ని తెలుసుకోలేకపోయిన భర్త.. తన భార్య, బిడ్డ కనిపించకుండా పోయారని పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు. అతడిచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఖాకీలు.. మొబైల్ లొకేషన్ ఆధారంగా యువతి జైపూర్‌లో ఉన్నట్లు గుర్తించి.. ఎట్టకేలకు ఆమెను పట్టుకున్నారు. ఆమె దగ్గరున్న చిన్నారిని చైల్డ్ వెల్ఫేర్ కమిషన్‌ను అప్పగించారు. భార్యభర్తలను ఒక చోట చేర్చి.. కౌన్సిలింగ్ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ సిబ్బంది ఇచ్చారు. అనంతరం భర్తతో కలిసి ఉండేందుకు ఆమె ఒప్పుకోవడంతో కథ సుఖాంతం అయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..