సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం ప్రజలు రకరకాల స్టంట్లు చేస్తున్నారు. కొందరు ఇతరులను ఎగతాళి చేస్తున్నారు. కొందరు తమను తాము దిగజారి ప్రవర్తిస్తున్నారు. రీల్స్ పేరుతో చాలా మంది చూడలేని వెర్రీ వేశాలు వేస్తున్నారు. ఇలాంటి చిత్ర విచిత్రమైన ఘటనలకు సంబంధించిన వార్తలు అనేకం ప్రతిరోజూ వెలుగులోకి వస్తున్నాయి. అలాగే, కొందరు పది మందిలో అసభ్యకరమైన పనులు చేస్తూ కూడా రీల్స్ చేస్తున్నారు. ఇలా రీల్స్ చేయడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ అమ్మాయి ఇండియా గేట్ వద్ద ఒంటికి టవల్ చుట్టుకుని అర్ధనగ్నంగా డ్యాన్స్ చేయడం వైరల్‌గా మారింది. ఇప్పుడు కూడా అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి రద్దీగా ఉండే మార్కెట్‌లో వెరైటీ డ్రెస్ వేసుకుని అసభ్యంగా రీల్స్ షూట్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..
హర్యానాలోని పానిపట్‌లోని మార్కెట్లో ఓ విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. రద్దీగా ఉన్న మార్కెట్లోకి ఒక వ్యక్తి ఉన్నట్టుండి బ్రా ధరించి ప్రత్యక్షమయ్యాడు. సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల కోసం ఆ అవతారంలో అసభ్యంగా రీల్స్ చిత్రించడం మొదలుపెట్టాడు. అతడి తీరుతో మహిళలు ఇబ్బంది పడుతుండటం గమనించిన దుకాణదారులు అతన్ని అడ్డుకుని తగిన గుణపాఠం చెప్పారు. ప్రజలతో రద్దీగా ఉండే మార్కెట్‌లో ఇలాంటి పిచ్చి పనులేంటని గట్టిగానే మందిలించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియో ఇక్కడ చూడండి..
फेमस होने के चक्कर में कुछ लोग अश्लीलता करने से भी पीछे नहीं हटते, मामला हरियाणा के पानीपत का है जहां अश्लील वीडियो शूट कर रहे इन लोगों का जनता द्वारा बढ़िया स्वागत किया गया!#panipat pic.twitter.com/WhesdlkHJV
— Parikshit Singh Rana Adv. (@iParikshitRana) November 26, 2024
కానీ, తొలుత ఆ యువకుడు స్థానికుల మాటలు వినిపించుకోలేదు. పైగా, తాను ఒక ఫేమస్ యూ ట్యూబర్‌ను అంటూ రెచ్చిపోయాడు..తాను గతంలో కూడా ఇలాంటి వీడియోలు చాలా చేశానని, తన అభిమానులకు ఇలాంటి వీడియోలే ఇష్టమని వాదించాడు. దాంతో ఆగ్రహించిన దుకాణదారులు అతడికి దేహశుద్ధి చేశారు. అతడితో క్షమాపణ చెప్పించుకున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రకరకాల కామెంట్స్ వచ్చాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..