అయ్యో పాపం.. ఆన్‌లైన్‌లో మేకను కొనబోయి.. తానే బకరా అయ్యాడు..! ఏం జరిగిందంటే..

|

Jan 14, 2024 | 6:56 PM

బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఓఎల్‌ఎక్స్‌ ద్వారా బెడ్‌ను విక్రయించేందుకు ప్రయత్నించి రూ.68 లక్షలు పోగొట్టుకున్నట్లు ఇటీవల వార్తల్లో వచ్చింది. ఈ ఘటనలో  39 ఏళ్ల ఇంజనీర్ తన OTP నంబర్‌ను మోసగాళ్లతో షేర్ చేసుకోవటం వల్ల డబ్బు పోయింది. మోసగాళ్లు బెడ్‌ కొనుగోలుదారులుగా నటించి మూడు రోజుల్లో ఈ మొత్తాన్ని దోచుకున్నారు కేటుగాళ్లు. ఇలాంటి మోసం..

అయ్యో పాపం.. ఆన్‌లైన్‌లో మేకను కొనబోయి.. తానే బకరా అయ్యాడు..! ఏం జరిగిందంటే..
Buy Goat Online
Follow us on

ప్రస్తుతం నడుస్తున్నదంతా డిజిటల్‌ యుగం.. ప్రజలు ప్రతి చిన్న, పెద్ద వస్తువును ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు. తద్వారా వారు డిస్కౌంట్ కూపన్‌ల ద్వారా డబ్బు ఆదా చేసుకోవచ్చు. లేదంటే మార్కెట్‌కు వెళ్లే ఇబ్బంది కూడా ఉండదు. ముఖ్యంగా పెద్ద నగరాల్లో ఇది సాధారణ విషయంగా మారింది. ఈ క్రమంలో ముంబైలో నివసిస్తున్న ఓ వ్యక్తికి ఆన్‌లైన్ షాపింగ్ అలవాటు ఎక్కువ. అలవాటులో భాగంగా ఆ వ్యక్తి ఆన్‌లైన్‌లో మేకను కొనుగోలు చేయాలనుకున్నాడు. మేకను కొనేందుకు అతడు ఇంటర్నెట్‌లో వెతికాడు. ఆ తర్వాత అతనికి రాయల్ గోట్ ఫామ్‌కు చెందిన అష్రఫ్ ఖురేషీ పేరుతో వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత అతనికి ఊహించని షాక్ తగిలింది.. అది వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు.

ముంబైకి చెందిన మహ్మద్ ఖురేషీకి సొంతంగా మొబైల్ స్టోర్ ఉంది. అతడు ఆన్‌లైన్ షాపింగ్‌కు బాగా అలవాటు పడ్డాడు. ఈ అలవాటుతోనే అతను ఆన్‌లైన్‌లో మేకలను కూడా కొనుగోలు చేయడం ప్రారంభించాడు. కానీ ఈ కోరిక కారణంగా, అతను చాలా బాధపడాల్సి వచ్చింది. ఆన్‌లైన్‌లో మేకలను కొనుగోలు చేయడం కోసం అతను ఆన్‌లైన్‌లో నిరంతరం వెతకసాగాడు. ఎట్టకేలకు అతనికి రాయల్ గాట్ ఫామ్‌కు చెందిన అష్రఫ్ ఖురేషీ నుంచి వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. అతనికి వాట్సాప్‌లో మేకకు సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు పంపారు. అష్రఫ్ ఖురేషీ తన వ్యవసాయ క్షేత్రంలో మేకలను పెంచుతున్నట్టుగా మెసేజ్‌లో వివరించాడు. ఆ మేకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పంపుతున్నానని చెప్పాడు. ఆ ఫోటోలు, వీడియోలను చూసి తనకు నచ్చిన మేకను ఎంపిక చేసుకున్నాడు మొహమ్మద్ ఖురేషీ. ఆ మేక ధర రూ.86,695లు కాగా,. దానిని మహ్మద్ ఖురేషీకి డెలివరీ చేసేందుకు రూ.6,600 ప్రయాణ ఖర్చులను కూడా డిమాండ్ చేశారు. ఆ మొత్తం కలిసి ఆన్‌లైన్‌లో మేక ఖరీదు రూ.93,295లకు చేరింది. మేకను పంపే ముందు తనకు పూర్తి మొత్తం చెల్లించాలని మహమ్మద్ ఖురేషీని కోరాడు.

జనవరి 2న ఖురేషీ గూగుల్ పే ద్వారా డబ్బు పంపారు. మేకను డెలివరీ చేస్తున్నానని, వాహనం త్వరలో మీ వద్దకు వస్తుందని ముంబైలోని విక్రోలి ప్రాంతంలోని జంక్షన్‌లో వేచి ఉండాల్సిందిగా ఖురేషీని కోరాడు. అయితే ఇక్కడికి చేరుకున్న మహమ్మద్ ఖురేషీ గంటల తరబడి వేచి చూసినా మేకను తీసుకొచ్చిన వాహనం రాలేదు. ఆ తర్వాత వాహనం నడుపుతున్న డ్రైవర్‌ నంబర్‌కు ఫోన్‌ చేసినా తీయలేదు. పొలం యజమానికి ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికిగానీ, తాను మోసపోయానని ఖురేషీకి అర్థమైంది. ఆ తర్వాత లబోదిబోమంటూ వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

ఇవి కూడా చదవండి

బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఓఎల్‌ఎక్స్‌ ద్వారా బెడ్‌ను విక్రయించేందుకు ప్రయత్నించి రూ.68 లక్షలు పోగొట్టుకున్నట్లు ఇటీవల వార్తల్లో వచ్చింది. ఈ ఘటనలో  39 ఏళ్ల ఇంజనీర్ తన OTP నంబర్‌ను మోసగాళ్లతో షేర్ చేసుకోవటం వల్ల డబ్బు పోయింది. మోసగాళ్లు బెడ్‌ కొనుగోలుదారులుగా నటించి మూడు రోజుల్లో ఈ మొత్తాన్ని దోచుకున్నారు కేటుగాళ్లు. ఇలాంటి మోసం ద్వారా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకోవడం ఇదే తొలిసారి అని బెంగళూరు పోలీసులు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..