ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేసే వైద్యులను దేవుడికి మరో రూపంగా భావిస్తుంటారు కొందరు. బ్రతికే ఛాన్స్ తక్కువ ఉన్నవారిని కూడా.. చాలాసార్లు వైద్యులు.. అద్భుతాలు చేస్తూ మరొక జీవితాన్ని ఇస్తుంటారు. అంతటి డాక్టర్లు శస్త్రచికిత్సలు చేసే సమయంలో ఎలాంటి చిన్న తప్పు చేసినా.. పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి అర్జెంటీనాలో చోటు చేసుకుంది. అర్జెంటీనాకు చెందిన ఒక వ్యక్తి పిత్తాశయంలో కొద్దిరోజులుగా భరించలేని నొప్పితో బాధపడుతున్నాడు. ఇక అందుకోసం శస్త్రచికిత్స చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్ళగా.. అతడికి జీవితంలో అతిపెద్ద షాక్ తగిలింది. పిత్తాశయానికి ఆపరేషన్ చేయాల్సింది పోయి.. దాన్నే స్టెరిలైజ్ చేసి పంపించారు సదరు వైద్యులు. దీంతో సదరు బాధితుడు ఏం చేయాలో పాలుపోక లబోదిబోమంటున్నాడు. అసలేం జరిగిందంటే..
వివరాల్లోకెళ్తే.. అర్జెంటీనాకు చెందిన 41 ఏళ్ల జార్జ్ అనే వ్యక్తి పిత్తాశయం ఆపరేషన్ కోసం స్థానికంగా కార్డోబాలో ఉన్న ఫ్లోరెన్సియో డియాజ్ ప్రావిన్షియల్ హాస్పిటల్‌కు వెళ్లాడు. శస్త్రచికిత్స ఫిబ్రవరి 28న చేయాల్సి ఉండగా.. అనుకోని కారణాల వల్ల ఒక రోజు వాయిదా పడింది. ఆ మరుసటి రోజు ఆసుపత్రి సిబ్బంది బాధితుడిని స్ట్రెచర్‌పై పడుకోబెట్టి.. ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. అతడి సమస్య ఏంటో తెలుసుకోకుండా.. అతడి హెల్త్ చార్ట్ కూడా చూడకుండా వైద్యులు.. జార్జ్‌కు ఆపరేషన్ చేసి.. పిత్తాశయాన్ని స్టెరిలైజ్ చేసేశారు. ఆ తర్వాతి రోజు జార్జ్ ఆరోగ్యం పరీక్షించుకునేందుకు వచ్చిన డాక్టర్.. జరిగిన ఆపరేషన్ గురించి వివరించగా.. దెబ్బకు కంగుతిన్నాడు.
కాగా, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన జీవితం నాశనమైందని జార్జ్ లబోదిబోమంటున్నాడు. సదరు వైద్యులపై, అలాగే ఆస్పత్రిపై కేసు పెట్టేందుకు సిద్దమయ్యాడు బాధితుడు. మరోవైపు ఆ ఆసుపత్రిలో వాసెక్టమీ ఆపరేషన్ వారంలో ప్రతీ బుధవారం చేస్తారట. ఫిబ్రవరి 28న బుధవారం కావడం, అదే రోజున జార్జ్ ఆపరేషన్ షెడ్యూల్ ప్రకారం ఉండటంతో.. అతడికి చేయాల్సింది అదే ఆపరేషన్ అనుకుని ఘోర పొరపాటు చేశారు వైద్యులు. అయితే సదరు డాక్టర్లు కనీసం జార్జ్ హెల్త్ చార్ట్‌నైనా చూసి ఉండాల్సిందని అతడి తరపు లాయర్ పేర్కొన్నారు.(Source)