‘నీడ్ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్’ అని అంటుంటారు. తెలివి అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు.. ప్రతీ ఒక్కరూ తమ తెలివితేటలను, సామర్ధ్యాన్ని ఏదొక సమయంలో బయటపెడుతుంటారు. గొప్ప గొప్ప ఇన్వెన్షన్లతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వాడకం పెరిగిపోవడంతో సామాన్యులు చేస్తోన్న సరికొత్త ఇన్వెన్షన్లు.. ఇంజినీర్లను సైతం సలాం కొట్టేలా చేస్తున్నాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం మరి..
మీరు బట్టలు ఇస్త్రీ చేసేవాడిని.. ఐరన్ బాక్స్, బొగ్గులతో చేయడం చూసే ఉంటారు.. అయితే గ్యాస్ సిలిండర్‌తో ఇస్త్రీ చేస్తుండటం ఎప్పుడైనా చూశారా.? అయితే ఈ వీడియో మీకోసమే.. వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వ్యక్తి గ్యాస్ సిలిండర్ సహాయంతో బట్టలు ఇస్త్రీ చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. అసలు గ్యాస్ సిలిండర్‌తో ఎలా ఇస్త్రీ చేస్తున్నావ్ అని అతడ్ని అడగ్గా.. ఏమో తనకు తెలియదని.. గత నాలుగేళ్లుగా ఈ విధంగానే బట్టలు ఇస్త్రీ చేస్తున్నానని అతడు చెప్పుకొచ్చాడు.
ఈ వీడియోను ‘giedde’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ అప్‌లోడ్ చేయగా.. వేల సంఖ్యలో వ్యూస్, లైకులు వచ్చిపడుతున్నాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.