Fish Attack: జంతువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అవి సాధు జంతువులైనా.. క్రూర జంతువులైనా. వాటిని ఆటపట్టించేందుకు, ఆటలాడేందుకు ఒక పరిమితి అంటూ ఉంటుంది. చనువుగా ఉన్నాయని ఓవర్ యాక్షన్ చేస్తే పిల్లి కూడా పులిలా మారుతుంది. మనపై దాడి చేస్తుంది. అందుకే జంతువుల పట్ల దయతో వ్యవహరించాలి అని అంటుంటారు. దీనికి విరుద్ధంగా ప్రవరిస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు. ఈ విషయాన్ని నిరూపించే సంఘటనలు ఇప్పటివరకు చాలా జరిగాయి. ముఖ్యంగా షార్క్, సెయిల్ ఫిష్‌లు మనుషులపై దాడి చేసి హతమార్చిన సంఘటనలు కూడా చూశాం. వీటికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో బాగా వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తగలరాని చోట తగలడంతో..
నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ఒక చేపని పట్టడం చూడవచ్చు. అతడు దాన్ని మొదటగా నేలపై పడేసాడు. ఆతర్వాత మళ్లీ దానిని ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లాలని భావిస్తాడు. అయితే ఆ చేప అతని చేతిలో నుంచి విడిపించుకోవడానికి తన తోకను వెనక్కి ముందుకు బలంగా ఆడిస్తుంది.ఈ క్రమంలోనే ఆ చేప తోక తగలరాని చోట తగులుతుంది. దీంతో అతను విలవిల్లాడిపోతాడు. ఆ బాధ భరించలేకపోతాడు. చేప దెబ్బకి కళ్ళు బైర్లు కమ్మడంతో వెంటనే చేపను కింద పడేసి పక్కకు వెళ్లిపోతాడు. అయితే ఈ దృశ్యం చూసి అతని కుటుంబ సభ్యులు నవ్వుతూ తెగ ఎంజాయ్ చేశారు. meemlogyandghantaa అనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరలవుతోంది దీన్ని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.ఇంకా నయం అతడికి పిల్లలు ఉన్నారు.
నెట్టింట్లో వైరలవుతోన్న ఈ వీడియోలో చేపను పట్టుకోబోయిన ఓ వ్యక్తికి పట్టపగలే చుక్కలు కనిపించాయి. అప్పుడే నీటిలో నుంచి బయటకు తీసిన చేపను చేతుల్లోకి తీసుకుంటుండగా అది విలవిల్లాడుతుంది. ఈక్రమంలోనే పొరపాటుగా చేపతోక తగలరాని చోట తగులుతుంది. దీంతో బాధతో విలవిల్లాడిపోతాడు. వెంటనే చేపను కింద పడేసి పక్కకు వెళ్లిపోతాడు. దీనిని చూసి పక్కన ఉన్న పిల్లలందరూ నవ్వుల్లో మునిగిపోతారు. . వీడియోను చూసిన నెటిజన్లందరూ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ‘చేప బాగా ప్రతీకారం తీర్చుకుంది’, ‘పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి నెట్టింట్లో వైరలవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..