Viral: నీ డెడికేషన్ తగలెయ్యా.. రోడ్డు మధ్యలో, రాత్రి 11 గంటలకు.. ఇంత పని పిచ్చి ఏంట్రా బాబు.. ఫైరవుతోన్న నెటిజన్లు..

|

Jul 13, 2022 | 12:51 PM

Trending: ఓ వ్యక్తి ఫ్లైఓవర్ మధ్యలో బైక్‌పై కూర్చొని ల్యాప్‌టాప్‌పై పని చేస్తున్న ఫొటో వైరల్‌గా మారింది. లింక్డ్‌ఇన్ వినియోగదారు హర్షమీత్ సింగ్ షేర్ చేసిన ఈ పోస్ట్‌కు తెగ కామెంట్లు వస్తున్నాయి.

Viral: నీ డెడికేషన్ తగలెయ్యా.. రోడ్డు మధ్యలో, రాత్రి 11 గంటలకు.. ఇంత పని పిచ్చి ఏంట్రా బాబు.. ఫైరవుతోన్న నెటిజన్లు..
Man Spotted Working On Laptop While Riding A Bike In Bengaluru
Follow us on

నెట్టింట్లో ప్రతిరోజు ఎన్నో ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వీటిలో కొన్ని మాత్రమే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. దీంతో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇందులో కొంతమంది చేసే పని చాలా విచిత్రంగా కనిపించడంతో, అలాంటి ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట్లో తెగ సందడి చేస్తుంటాయి. ఇలాంటిదే ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.

అత్యంత రద్దీగా ఉన్న బెంగళూర్ ప్రధాన రహదారిపై ఓ వ్యక్తి అది కూడా రాత్రి 11 గంటల సమయంలో బైక్‌పై కూర్చుని తన ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్నాడు. దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ టైంలో అంత రద్దీ ప్లేస్‌లో నీతో వర్స్ చేయించే బాస్ ఎవరంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. వర్క్‌లో పడి, అతను అసలు ఎక్కడ ఉన్నాడో కూడా గమనించకుండా పనిచేస్తున్నాడంటూ పలువురు జాలి పడుతున్నారు. లింక్డ్‌ఇన్ వినియోగదారు హర్షమీత్ సింగ్ షేర్ చేసిన ఈ పోస్ట్‌కు తెగ కామెంట్లు వస్తున్నాయి. ఈ పోస్ట్‌కి 40,000 కంటే ఎక్కువ లైక్‌లు, 1,000 కంటే ఎక్కువ షేర్లు వచ్చాయి. అంటే, ఈ ఫొటో నెటిజన్లను ఎంత ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ మేరకు ‘ఒక బాస్‌గా మీరు మీ సహోద్యోగులను వారి స్వంత భద్రతను ఫణంగా పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తూ, పని చేయించుకుంటున్నారు. ముఖ్యంగా ‘IT’S URGENT’, ‘DO IT ASAP’ అనే పదాలను వాడి ప్రెజర్‌తో పనిచేయించుకుంటున్నారు. ఈ పదాలు మీ కింది ఉద్యోగుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో మీకు తెలియదు” అంటూ హర్షమీత్ సింగ్ క్యాప్షన్ అందించాడు.

దీనిపై కొందరు నెటిజన్లు మాత్రం.. ఆఫీసులో పని ఉన్నప్పుడు చేయకుండా, ఇప్పుడు చేస్తున్నాడేమో అంటూ కామెంట్లు చేయగా, మరికొందరు మాత్రం, ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తున్నాడు అనుకుంటా అంటూ ఫన్నీగా కామెంట్లు చేశారు. మరికొంతమంది మాత్రం ఓ బాధ్యతయుత పౌరుడిగా నడుచుకోవాలని, అలా రోడ్డుపై పనిచేయడం తప్పు అంటూ తన అభిప్రాయాలను పంచుకున్నారు. మొత్తానికి ఈ ఫొటో మాత్ర నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.