Viral Video: నువ్వు దేవుడివి సామీ.. విషపూరిత పాములను కాపాడిన వ్యక్తి..

భారతదేశంలో సుమారు 350 రకాల పాములున్నాయి. వీటిల్లో విషం లేని పాముల కంటే విషపూరితమైన పాములు తక్కువే. అయితే రకరకాల కారణాలతో పాములు మానవ నివాసాలలోకి ప్రవేశిస్తాయి. పాము అంటే చాలు భయపడే ప్రజలు వాటిని చంపుతారు. అయితే కొంతమంది పాములను కాపాడటానికి కూడా కృషి చేస్తారు. ఎటువంటి విషపూరితమైన పామునైనా పట్టుకుని సురక్షితమైన ప్రదేశంలో విడిచి పెడతారు. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు బీచ్‌లో పడి ఉన్న అనేక పాముల ప్రాణాలను కాపాడి సముద్రంలోకి తిరిగి విడిచిపెట్టాడు.

Viral Video: నువ్వు దేవుడివి సామీ.. విషపూరిత పాములను కాపాడిన వ్యక్తి..
Viral Video

Updated on: Oct 21, 2025 | 10:39 AM

సాధారణంగా ప్రజలు పాములను చూసిన వెంటనే పారిపోతారు లేదా దూరంగా వెళ్లిపోతారు. ఎందుకంటే ఒకవేళ అవి విషపూరితమైన పాములైతే అవి కాటు వేస్తే చాలా ప్రమాదకరం కావచ్చు. ఒకోక్కసారి ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. అయితే ధైర్యం చూపించి పాములను రక్షించే వ్యక్తులు కొందరు ఉన్నారు. వాటిని చాలా జాగ్రత్తగా పట్టుకుని సురక్షిత ప్రాంతంలో విడిచి పెడతారు. ప్రస్తుతం పాములకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో సముద్ర తీరంలో పడి ఉన్న విషపూరిత పాముల ప్రాణాలను నిర్భయంగా కాపాడుతున్న ఒక వ్యక్తి కనిపించాడు.

వీడియోలో బీచ్‌లో పడి ఉన్న పాములను చూపిస్తూ ఒక వ్యక్తి కనిపించాడు. హఠాత్తుగా చూస్తే అవి సముద్రం నుంచి ఒడ్డుకు వచ్చిన చేపలు అని అనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తి వాటిని తాకిన వెంటనే.. అవి చేపలు కాదని, పాములని తెలుస్తుంది. తరువాత ఒక్కొక్కటిగా పామును పట్టుకుని.. బుట్టలో వేసుకుని సముద్రంలో తిరిగి విడిచి పెట్టాడు. ఆ వ్యక్తి ధైర్యంవంతుడు. ఎందుకంటే వాటిని పట్టుకునేటప్పుడు అతను ముఖంలో భయం ఎక్కడా కనిపించలేదు. ఈ విధంగా ఆ వ్యక్తి 100 కి పైగా విషపూరిత పాముల ప్రాణాలను కాపాడాడని వీడియో పేర్కొంది. అయితే ఇది AI వీడియోగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

వీడియోను 9 మిలియన్లకు పైగా చూశారు
ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో nomad_bogati అనే IDతో షేర్ చేయబడింది. దీనిని ఇప్పటివరకు 9 మిలియన్లకు పైగా వీక్షించారు. 65 వేలకు పైగా ప్రజలు ఈ వీడియోను లైక్ చేసి వివిధ రకాల కామెంట్స్ చేశారు.

వీడియో చూస్తూ కొందరు “సోదరా, నువ్వు మనిషివి కాదు, నువ్వు సూపర్ హీరోవి!” అని అంటున్నారు మరికొందరు, “మనం భయంతో పారిపోయే చోట.. ఈ మనిషి పాములను కాపాడుతున్నాడు. ఇలాంటి వారికి సెల్యూట్.” అదేవిధంగా ఒక యూజర్ “వీడియో చూసిన తర్వాత, మానవత్వం ఇంకా బ్రతికే ఉందని నేను గ్రహించాను.” అని అంటే.. కొంతమంది యూజర్లు దీనిని AI వీడియో అని కూడా అంటున్నారు.

వీడియోను ఇక్కడ చూడండి

 

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..