కోయంబత్తూరులోని బోతనూరు తిరుమలై నగర్ ప్రాంతంలోని ఓ ఇంటి పూల కుండీలో నాగుపాము కలకలం రేపింది. ఇది చూసిన ఇంటి యజమాని గ్రీన్‌కేర్ సంస్థకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ సినెక్ అమీన్ నాగుపామును సునాయాసంగా పట్టుకున్నాడు. పట్టుబడిన పాము దాదాపు నాలుగున్నర అడుగుల పొడవు ఉంది. ఇది చూసి కుటుంబసభ్యులతో పాటు ఇరుగుపొరుగు వారందరూ షాక్‌కు గురయ్యారు.
పట్టుబడిన పామును పెరియకుళం పశ్చిమ ఒడ్డున నోయ్యల్ నదికి ఆనుకుని ఉన్న పొదల్లో వదిలేశారు. వేసవి కాలం వచ్చిందంటే కోయంబత్తూరులోని పలు ప్రాంతాల్లో చల్లటి ప్రదేశాలను వెతుక్కుంటూ పాములు సహా పలు విష జంతువులు నివాస ప్రాంతాల్లోకి ఎక్కువగా వస్తున్నాయి.
ఈ ప్రాంతంలో గత 10 రోజుల క్రితం 2 పాములను పట్టుకుని అడవుల్లోకి వదిలారు. పిల్లలంతా సాయంత్రం వేళల్లో ఆడుకోవడం, త్వరలో పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ఉండడంతో పిల్లలంతా ఆ ప్రాంతంలో ఎక్కువ సేపు ఆడుకుంటున్నారని, కావున మున్సిపల్ పాలకవర్గం పాములు పట్టుకుని చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.. నివాస ప్రాంతంలో పాముల సంచారంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామంటూ ప్రజలు వాపోతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..