Viral Video: డ్రాగన్‌తో పోజులిచ్చాడు.. ఇంతలోనే ఊహించని ట్విస్ట్‌.. చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే..

భారీ ఫైతాన్‌ను ఓ వ్యక్తి మెడలో వేసుకోని స్టైల్‌గా నిలబడి ఉన్నాడు. ఈ క్రమంలో పాము ఊహించని ట్విస్ట్ ఇస్తుంది. సాధారణంగా పైథాన్ శక్తివంతమైన పాము. ఇది ఇతర పాములతో పోలిస్తే దాని పొడవు, బరువు కూడా అత్యధికం.

Viral Video: డ్రాగన్‌తో పోజులిచ్చాడు.. ఇంతలోనే ఊహించని ట్విస్ట్‌.. చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే..
Viral News

Updated on: May 16, 2022 | 4:12 PM

Man Posing with giant black python: సాధారణంగా పాములు చూస్తేనే గజగజ వణికిపోతుంటాం.. ఇంకా దగ్గరగా చూస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా.. నెట్టింట (Social Media) ఓ పాముకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. భారీ ఫైతాన్‌ను ఓ వ్యక్తి మెడలో వేసుకోని స్టైల్‌గా నిలబడి ఉన్నాడు. ఈ క్రమంలో పాము ఊహించని ట్విస్ట్ ఇస్తుంది. సాధారణంగా పైథాన్ శక్తివంతమైన పాము. ఇది ఇతర పాములతో పోలిస్తే దాని పొడవు, బరువు కూడా అత్యధికం. ఈ పాము ఎదురుగా కనిపిస్తే.. ఎవ్వరికైనా దడ పుడుతుంది. అయితే.. అలాంటి భారీ పాముతో ఓ వ్యక్తి ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఇంతలోనే జరిగిన ఊహించని పరిమాణంతో ఒక్కసారిగా షాకవుతాడు. ఈ వీడియోను చూసి కొందరు ఆశ్చర్యపోతుండగా.. మరికొందరు పైథాన్‌తోనే వేశాలా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ వ్యక్తి తన మెడలో పెద్ద నల్ల కొండచిలువను వేసుకోని ఉండటాన్ని చూడవచ్చు. ఈ వ్యక్తి కొండచిలువతో ఫోటో దిగాలనుకుంటున్నాడు. దీంతోపాటు.. అతను ఫోజులిస్తుండగా.. ఫోటోగ్రాఫర్ తిసేందుకు ప్రయత్నిస్తున్నాడు. కొన్ని సెకన్లపాటు అంతా మంచిగానే ఉందనుకున్న క్రమంలో కొండచిలువ కదలడం ప్రారంభించింది. కొండచిలువ వ్యక్తి ముఖానికి చేరుకోగానే.. నాలుకను బయటకు తీస్తుంది. దీంతో అతను ఒక్కసారిగా భయపడిపోయి.. ముఖాన్ని వెనక్కి తిప్పుకుంటాడు. ముందుగా ఈ వీడియో చూడండి..

వైరల్ వీడియో..

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో snakes.mania అనే పేజీలో షేర్ చేయగా.. లక్షలాది మంది వీక్షించడంతోపాటు 22 వేల మంది లైక్ చేశారు. దీంతోపాటు పలు రకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Also Read:

Viral Video: దొంగతనానికే ఇది పరాకాష్ట.. మహిళ చేతి వాటం చూస్తే దిమ్మ తిరగాల్సిందే..

Viral Photo: ఈ ఫొటోలో ఉన్న రెండో చిరుత తల ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం.. ఎంత వెతికినా కనిపించట్లేదా.?