దేశంలో నైపుణ్యం ఉన్నవారికి కొరత లేదు. అయితే ప్రతిభకు తగిన సరైన ప్లాట్‌ఫారమ్ దక్కాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రతిభ వెలుగులోకి రాకుండా మరుగున పడిపోతుంది. విభిన్న ప్రతిభావంతులైన వ్యక్తులు అనేకమంది మీ జీవితంలో కనిపిస్తూనే ఉంటారు. ముఖ్యంగా రోడ్డుమీద, రైళ్లలో గాయకులను చూసి ఉంటారు, వారి స్వరం హృదయాన్ని తాకుతుంది. అయితే సరైన వేదిక లభించకపోవడంతో అలాంటి గాయకులు ఇష్టం లేకపోయినా భిక్షాటన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అలాంటి జానపద గాయకుడి వీడియో ఒకటి వైరల్ అవుతువుంది. ఈ వీడియో ప్రజలను భావోద్వేగానికి గురిచేస్తోంది. ఒక వ్యక్తి రోడ్డు పక్కన సారంగిని ప్లే చేస్తూ.. తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
వైరల్ అవుతున్న వీడియోలో రోడ్డు పక్కన సారంగిని ప్లే చేస్తున్న వ్యక్తిని చూడవచ్చు. ఆ యువకుడి పక్కన ఒక స్త్రీ కూర్చుని ఉంది. బహుశా ఆమె అతని భార్య. ఆ వ్యక్తి సారంగితో రాజస్థాన్ జానపద పాట ‘పదరే మ్హరే దేశ్’ ట్యూన్‌ను ప్లే చేస్తున్నాడు. విన్న వారు మంత్రముగ్ధులౌతున్నారు. ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయని అశ్వినీ భిడే దేశ్‌పాండే స్వయంగా జానపద పాటను హమ్ చేయడం ప్రారంభించారు.
Video taken by the popular Shastriya Sangeet legend Smt. Ashwini Bhide – She is the one who sings along after she got down from the train and on hearing this talented guy play the local variant of Sarangi.
Made my day
WhatsApp forwards are… pic.twitter.com/vVUtXDUh0i
— AMIT ANAND BIVALKAR (@BIVALKAR) June 3, 2023
ఈ వీడియోను @BIVALKAR హ్యాండిల్‌లో అమిత్ బివాల్కర్ అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేసారు. అమిత్ చెప్పిన ప్రకారం ఈ వీడియోను శాస్త్రీయ సంగీత గాయని అశ్విని భిడే దేశ్‌పాండే రికార్డ్ చేశారు. 3 నిమిషాల 38 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటివరకు 1.3 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ ను సొంతం చేసింది. ప్రజలు విపరీతంగా ఇష్టపడుతున్నారు, వ్యాఖ్యానిస్తున్నారు.. రీట్వీట్ చేస్తున్నారు.
ఒక లెజెండ్ మాత్రమే నిజమైన ప్రతిభను అభినందించగలరని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు అద్భుతమైన ప్రతిభ. అయితే సరైన వేదిక లేకపోవడంతో ఇలాంటి నైపుణ్యం మరుగున పడిపోతుందని తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..