Watch: లైఫ్‌కి గ్యారెంటీ లేదు గురూ..! అమ్మాయి బైక్‌ ఎక్కితే చాలు.. ఇలా చావు అంచుల వరకు తీసుకెళ్తారు..!!

ఈ వీడియోకు ఇప్పటికే 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. చాలా మంది కామెంట్స్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. అందులో ఒకరు వ్యాఖ్యనిస్తూ.. "ఈ ఇద్దరూ కలిసి జీవిస్తారనడానికి, కలిసి చనిపోతారనడానికి ఇదే నిదర్శనం." అంటూ కామెంట్‌ చేశారు. ఆ అబ్బాయితో బైక్‌పై కూర్చోని ప్రయాణించడానికి ఆ అమ్మాయి ధైర్యం చేసిందంటూ పలువురు ప్రశంసించారు.

Watch: లైఫ్‌కి గ్యారెంటీ లేదు గురూ..! అమ్మాయి బైక్‌ ఎక్కితే చాలు.. ఇలా చావు అంచుల వరకు తీసుకెళ్తారు..!!
Reckless Bike Ride

Updated on: Jun 20, 2024 | 5:51 PM

కొందరు పొకిరీలు చేసే బైక్‌స్టంట్స్‌ భయంకరంగా ఉంటాయి. ఇక బైక్‌ వెనకాల అమ్మాయి కూర్చుని ఉందంటే.. వారి వెర్రీ చేష్టలకు మరింత బలం వస్తుంది. యువతీ యువకులు కలిసి చేసే విన్యాసాలకు హద్దు అదుపులేకుండా పోతుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్‌ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ బైక్ స్టంట్ వీడియో ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. హెల్మెట్ లేకుండా ఓ జంట ప్రమాదకరమైన విన్యాసాలు చేసింది. సోషల్ మీడియా సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో @itx_toxic_sa ఖాతా ద్వారా ఈ వీడియో షేర్ చేయబడింది.

నేటి సోషల్ మీడియా యుగంలో, అప్ కమింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు వైరల్ అయ్యేలా ప్రమాదకరమైన పనులు చేస్తుంటారు. అది చూసి కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. కొన్నిసార్లు ఖాళీ రోడ్లపై బైక్‌లు, కార్లతో రద్దీగా ఉండే రోడ్లపై చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. ఇక్కడ వైరల్‌ వీడియోలో కూడా ఓ యువకుడు తన ప్రియురాలితో కలిసి బైక్‌పై రోడ్డు దాటుతున్నాడు. ఆ తరువాత ఏం జరిగిందో చూస్తే షాక్ అవుతారు! బైక్‌పై ప్రియురాలితో కలిసి ఆ యువకుడు చేసిన స్టంట్ చూసి స్థానికులు కంగుతిన్నారు. ఇది మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది.

@itx_toxic_sa ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియో పోస్ట్ చేయబడింది. అక్కడ ఓ జంట బైక్ స్టంట్స్ చేస్తూ కనిపించింది. హెల్మెట్ లేదు. అయితే సడెన్ గా బ్రేకులు వేసి స్టంట్స్ చేయడం మొదలుపెట్టాడు. బైక్ వెనుక సీటులో అమ్మాయి కూర్చుని ఉంది. ఒక్కసారిగా ఆ యువకుడు బైక్ ముందు చక్రాన్ని సున్నాకి ఎత్తేశాడు. ప్రమాదం అంచువరకు వెళ్లాడు..కాగా, ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది!

ఇవి కూడా చదవండి

ఈ వీడియోకు ఇప్పటికే 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. చాలా మంది కామెంట్స్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. అందులో ఒకరు వ్యాఖ్యనిస్తూ.. “ఈ ఇద్దరూ కలిసి జీవిస్తారనడానికి, కలిసి చనిపోతారనడానికి ఇదే నిదర్శనం.” అంటూ కామెంట్‌ చేశారు. ఆ అబ్బాయితో బైక్‌పై కూర్చోని ప్రయాణించడానికి ఆ అమ్మాయి ధైర్యం చేసిందంటూ పలువురు ప్రశంసించారు.

మరోవైపు ప్రస్తుతం సోషల్ మీడియా కలకలం రేపుతోంది. ట్రాఫిక్‌ జామ్‌ను నివారించడానికి ఓ యువకుడు డివైడర్‌పై నుంచి మోపెడ్‌ను నడుపుతున్న దృశ్యం ఈ వీడియోలో ఉంది. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువకుడు హెల్మెట్ కూడా ధరించకుండా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాడు. ఆ యువకుడి పనిని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us