Viral Video: అతనికి ఏమైంది.. ఎత్తైన భవనం నుండి దూకేసిన వ్యక్తి.. షాకింగ్ వీడియో వైరల్

తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఏదొక పని చేస్తూ సంచలనం సృష్టించాలనుకుంటారు. మొండితనంతో ఇలాంటి వారు చేసే పనులు చూపరులకు షాక్ తెప్పిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న  వీడియోలో ఒక వ్యక్తి ఎత్తైన భవనం బాల్కనీ నుండి క్రిందికి దూకుతున్నట్లు కనిపిస్తుంది.

Viral Video: అతనికి ఏమైంది.. ఎత్తైన భవనం నుండి దూకేసిన వ్యక్తి.. షాకింగ్ వీడియో వైరల్
Viral Video

Updated on: Jun 25, 2023 | 8:00 AM

ప్రపంచంలో కొందరు వ్యక్తులు ఉంటారు.. తాము చేసే పని వలన తమకు మాత్రమే కాదు.. ఇతరులకు కూడా ఇబ్బందులు కలుగుతాయా.. లేక ప్రమాదాలు ఏర్పడుతాయా అని ఆలోచించకుండా తమ మనసుకు  ఏది తోస్తే అది చేసేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే తాము చేసే పని వలన కలిగే ప్రమాదం గురించి వారికీ ముందే తెలుసు.. అయినప్పటికీ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఏదొక పని చేస్తూ సంచలనం సృష్టించాలనుకుంటారు. మొండితనంతో ఇలాంటి వారు చేసే పనులు చూపరులకు షాక్ తెప్పిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న  వీడియోలో ఒక వ్యక్తి ఎత్తైన భవనం బాల్కనీ నుండి క్రిందికి దూకుతున్నట్లు కనిపిస్తుంది.

ఎదురుగా ఉన్న భవనంలో నివసిస్తున్న ఓ వ్యక్తి తన కెమెరాలో ఈ సన్నివేశాన్ని బందించగా ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి హడావుడిగా బాల్కనీకి వచ్చి బాల్కనీ నుంచి నేరుగా కిందకు తొంగిచూడడం వీడియోలో చూడొచ్చు. ఆ తర్వాత బాల్కానీని పట్టుకున్న చేయి వదిలేచాడు.  అప్పుడు అతను నేరుగా భవనం నుండి కింద పడిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది వీడియోలో చూపించనప్పటి.. వీడియో చూసి, భవనం ఎత్తును బట్టి ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడని లేదా తీవ్రంగా గాయపడి ఉండవచ్చని ఊహిస్తున్నారు నెటిజన్లు

ఇవి కూడా చదవండి

వైరల్‌గా మారిన ఈ వీడియో @1secB4disaster అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేవలం 10 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 2.8 మిలియన్లు అంటే 28 లక్షల మంది వీక్షించారు.  20 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేశారు.

అదే సమయంలో వీడియో చూసిన తర్వాత నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేశారు. అతను బతికిడా?’ అని కొందర అంటే.. ‘అతనికి ఏమైంది?’ అని కొందరు అడుగుతున్నారు.  కొంతమంది నెటిజన్లు ఈ ఘటన  కెనడాలో  లేదా జర్మనీలో చోటు చేసుకుందని చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us