పాపం.. లక్షలు ఖర్చుపెట్టి కుక్కలా మారిన మనిషి.. చివరకు ఏమైందో తెలిస్తే జాలేస్తుంది..!

|

Dec 06, 2023 | 10:50 AM

సోషల్ మీడియాలో ప్రతినిత్యం అనేక రకాల వార్తలు వైరల్‌ అవుతుంటాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక కొత్త, విభిన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటిలో చాలా విషయాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. కొన్ని మనకు నమ్మశక్యం కానివి, అసంభవమైనవి కూడా ఉంటాయి. అలాంటి విచిత్రమైన పరిణామాలు కూడా సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే చాలా కాలంగా వార్తల్లో నిలిచిన వ్యక్తి ఒకరు ఉన్నారు. అతను జపాన్‌కు చెందిన టోకో. ఇది అతని […]

పాపం.. లక్షలు ఖర్చుపెట్టి కుక్కలా మారిన మనిషి.. చివరకు ఏమైందో తెలిస్తే జాలేస్తుంది..!
Toco, the man who transformed into a dog
Follow us on

సోషల్ మీడియాలో ప్రతినిత్యం అనేక రకాల వార్తలు వైరల్‌ అవుతుంటాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక కొత్త, విభిన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటిలో చాలా విషయాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. కొన్ని మనకు నమ్మశక్యం కానివి, అసంభవమైనవి కూడా ఉంటాయి. అలాంటి విచిత్రమైన పరిణామాలు కూడా సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే చాలా కాలంగా వార్తల్లో నిలిచిన వ్యక్తి ఒకరు ఉన్నారు. అతను జపాన్‌కు చెందిన టోకో. ఇది అతని అసలు పేరు కాదు. తన అసలు పేరు, ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు. దానికి కారణం కూడా ఉంది. టోకో ఫేమస్‌ కావడానికి ఇదే కారణం.

టోకో తాను మనిషిని కాదని జంతువునని పేర్కొన్నాడు. అందుకే 12 లక్షల రూపాయలు వెచ్చించి భయంకరమైన కుక్కలా తయారయ్యాడు.. ఆ తర్వాత ఈ వేషం వేసుకుని కుక్కలా నటించటం మొదలుపెట్టాడు. అసలు జీవితంలో ఏం చేస్తాడో, ఎలా జీవిస్తున్నాడో స్పష్టంగా తెలియదు. కానీ అతని జీవితం సోషల్ మీడియాలో టోకో అనే కుక్కలా ప్రపంచానికి పరిచయమయ్యాడు. అలా అతడు కుక్క రూపంలో ఉన్న ఫోటోలు, వీడియోల ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించాడు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు టోకో కుక్కల మాదిరిగా కొన్ని రకాల ఆటలు ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు.. అయితే అలాంటి ప్రయత్నాలేవీ ఫలించలేని, అతడు షేర్ చేసిన ఫోటోలను బట్టి తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఆఫోటోలను చూసిన చాలా మంది ప్రతికూలంగా స్పందించారు. చాలా మంది అతనికి మానసిక వ్యాధి ఉందని, చికిత్స అవసరమని చెప్పారు. మరికొందరు టోకోకు ప్రేమపూర్వకంగా, స్నేహపూర్వకంగా సలహా ఇస్తున్నారు.. మీరు థెరపీ తీసుకోండి..పైగా, వయసు కూడా మీదపడింది.ఇలాంటి ప్రయోగాలు చేయకూడదు, ఇది మీ ఆరోగ్యానికి సవాలు, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంటూ సలహాలు, సూచనలు చేస్తున్నారు.

ఏది ఏమైనా టోకో నెగెటివ్ కామెంట్స్‌ను ఏ మాత్రం లెక్కచేయటం లేదని తెలుస్తుంది. ఈ రకమైన వ్యక్తిత్వ సమస్యలు ఇతరులను కూడా ప్రభావితం చేస్తాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, టోకో షేర్ చేసిన ఫోటోలపై మాత్రం నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..