Viral Video: నీటిలో తేలియాడుతోన్న నల్లటి ఆకారం.. ఏంటని తోక పట్టుకుని లాగగా గుండె గుభేల్..
టైటానోబోవా పాము. దీనిని 'మోన్‌స్టర్ స్నేక్' అని కూడా పిలుస్తారు. ఇప్పటివరకు భూమిపై ఉన్న అతిపెద్ద పాములుగా వీటినే పరిగణిస్తారు.
కోట్ల సంవత్సరాల క్రితం, డైనోసార్‌లు భూమిని పాలించినప్పుడు, వాటిలాగే, ప్రపంచంలో అనేక ఇతర పెద్ద జీవులు ఉండేవి. అందులో ఒకటి టైటానోబోవా పాము. దీనిని ‘మోన్‌స్టర్ స్నేక్’ అని కూడా పిలుస్తారు. ఇప్పటివరకు భూమిపై ఉన్న అతిపెద్ద పాములుగా వీటినే పరిగణిస్తారు. ప్రస్తుతం ఆఫ్రికా అడవుల్లో కనిపించే అనకొండల కంటే ఇవి చాలా పెద్దవి. మొసళ్లను సైతం అమాంతం మింగేసే సామర్ధ్యం వీటికి ఉంటుందని చెబుతుంటారు. ప్రస్తుతం అలాంటి పాముకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిని చూసిన తర్వాత పొరపాటున అందరూ అది ‘టైటానోబోవా’ అని అనుకుంటున్నారు. కానీ నిజానికి అది భారీ సైజ్ ఉన్న అనకొండ. వీడియో చూస్తే మీ గుండెలు అదిరిపోవడం ఖాయం.
ఓ వ్యక్తి తన పడవలో చేపల పట్టేందుకు స్థానికంగా ఉండే సరస్సులోకి వెళ్లాడు. అతడు బోలెడన్ని చేపలు పడతాయని ఊహిస్తే.. జరిగింది మరొకటి. తన వలకు ఓ పెద్ద పాము చిక్కింది.. సారీ.. అదే భారీ అనకొండ దొరికింది. దాని తోక పట్టుకుని పైకి లాగేందుకు ఈ వ్యక్తి ట్రై చేయగా.. అది తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అయితేనేం చివరికి ఆ అనకొండ అతడి చేతుల నుంచి బయటపడి.. వేగంగా నీటిలో ఈదుతూ అడవి వైపుగా వెళ్ళిపోయింది. మీరు కేవలం సినిమాల్లో చూడటమే తప్ప.. ఇంతటి పెద్ద అనకొండను ఎప్పుడూ చూసి ఉండరు. లేట్ ఎందుకు వీడియోపై ఓ లుక్కేయండి.
Fishermen finds huge anaconda. pic.twitter.com/cBkTwotyXD
— Fascinating Footage (@FascinateFlix) January 12, 2023
కాగా, ఇటీవల ఈ వీడియోను ట్విట్టర్‌లో ఓ నెటిజన్ షేర్ చేశాడు. కేవలం 17 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోకు ఇప్పటివరకు 9.4 మిలియన్ల వ్యూస్ రాగా.. దీనిని 65 వేల మంది లైక్ చేశారు. అలాగే దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఇది అనకొండ కాదు టైటానోబోవా అని కొందరు కామెంట్ చేయగా, ‘టైటానోబోవా అంతరించిపోలేదా?’ అని మరికొందరు ఆశ్చర్యపోతున్నారు. అదే విధంగా, ఇంకొందరు ఇది ఏ సినిమాలోని విజువల్ అయి ఉండొచ్చునని అభిప్రాయపడుతున్నారు.