శృంగారం సృష్టికి మూలం. భార్యాభర్తల మధ్య బంధం బలపడేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. అలాగే మనిషి ఆరోగ్యంపై శృంగారం ఎంతగానో ప్రభావం చూపుతుందని చాలామంది వైద్యులు కూడా చెబుతున్నారు. అలాగే ప్రతీరోజూ శృంగారం చేయడం ఆరోగ్యానికి మంచిది. అయితే ఈ మధ్యకాలంలో కొందరిపై పోర్న్ వీడియోల ప్రభావం ఎక్కువగా ఉంది. శృంగారాన్ని పీక్స్‌కు చేరాలని.. తెగ ఎంజాయ్ చేయాలనే ఆతృతతో ప్రమాదకరమైన భంగిమలు ప్రయత్నిస్తున్నారు. కట్ చేస్తే.. లేనిపోని సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి టాంజానియాలో చోటు చేసుకుంది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
టాంజానియాకు చెందిన 36 ఏళ్ల వ్యక్తి తన భాగస్వామితో సెక్స్‌లో పీక్స్‌కు చేరాలనుకున్నాడు. కట్ చేస్తే.. సెక్స్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా తన ప్రైవేటు పార్ట్ దగ్గర మూడు చోట్ల విరిగినట్లు శబ్దం విన్నాడు. అంతే! ఇంకేముంది ఉబ్బిపోయిన పురుషాంగంతో ఆసుపత్రిపాలయ్యాడు. మహిళలకు సంబంధించిన ప్రైవేటు పార్ట్‌లోని సున్నితమైన ప్రదేశాన్ని పురుషాంగం గట్టిగా తాకడం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు చెప్పారు.
అంతేకాకుండా బాధితుడు తనకు ఐదు గంటలుగా మూత్రనాళం నుంచి రక్తం కారినట్లు చెప్పుకొచ్చాడు. అలాగే ఎక్స్‌రే స్కానింగ్‌లో కూడా బాధితుడి ప్రైవేటు పార్ట్‌లో మూడు చోట్ల ఫ్రాక్చర్ అయినట్లు బయటపడింది. కాగా, అతడికి శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు.. మూడు రోజుల అనంతరం డిశ్చార్జ్ చేశారు. అనంతరం ఆరు నెలల తర్వాత తన శృంగారం జీవితం మళ్లీ ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా అయ్యిందని బాధితుడు పేర్కొన్నాడు.(Source)