Viral Video: ఓర్నీ.! ఇదేం క్రియేటివిటీ.. ఈ వ్యక్తి చేసిన వింత స్కూటర్‌ను చూస్తే నోరెళ్లబెడతారు..
సోషల్ మీడియాలో అనేక వైరల్ వీడియోలు మనల్ని ప్రతీసారి ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంటర్నెట్ వినియోగం పెరిగిన దగ్గర నుంచి..

సోషల్ మీడియాలో అనేక వైరల్ వీడియోలు మనల్ని ప్రతీసారి ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంటర్నెట్ వినియోగం పెరిగిన దగ్గర నుంచి ఎంతోమంది వ్యక్తులు తమలోని ప్రతిభను వెలికితీస్తూ.. కొత్త కొత్త ఇన్వెన్షన్లు సృష్టిస్తున్నారు. ఇదే కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి చేసిన వింత స్కూటర్‌ను చూసిన తర్వాత ఒక్క క్షణం మీరు కూడా ఆశ్చర్యపోతారు. అసలు ఆ వ్యక్తి.. దీనిని ఎలా చేయగలిగాడని అనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే..
ఓ వ్యక్తి తన తెలివికి పదును పెట్టి దేశీ స్కూటర్‌ను తయారు చేశాడు. ఇరుక్కుని ఒకే స్కూటర్‌లో తన ఇద్దరు పిల్లలు, భార్యను తీసుకెళ్లడం కష్టం అవుతుందని అనుకున్నాడో.. లేక అలా తీసుకెళ్లడం ఇష్టం లేకో.. తెలియదు గానీ.. ఆటోమొబైల్ ఇంజినీర్ మాదిరిగా సులభంగా రెండు స్కూటర్లు కలిపేశాడు. ఇంచక్కా తన కుటుంబాన్ని ఎక్కించుకుని జాలీగా బయటికి తీసుకెళ్లాడు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి వీడియోపై లుక్కేయండి.
Jugaad ! pic.twitter.com/tBM29k5IoM
— Joseph John (@josephjohn2611) November 18, 2021
కాగా, ఈ వీడియోను ‘Joseph John’ అనే నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పటిదాకా దీనికి 1.6 వేల వ్యూస్ రాగా.. 85 లైకులు వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. ‘ఈ స్కూటర్ RTO సేఫ్టీ టెస్ట్ పాస్ కాదేమో’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ‘ఆ వ్యక్తి ఆవిష్కరణ సో కూల్’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.