Black Salt: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బ్లాక్ సాల్ట్.. తయారీ ఎంత ప్రమాదకరమో తెలుసా..? వీడియో వైరల్‌

|

Nov 10, 2023 | 8:59 AM

ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల ఉప్పులు అందుబాటులో ఉన్నాయి. తెల్ల ఉప్పు నుండి పింక్‌ సాల్ట్‌ వరకు అందుబాటులో ఉంటుంది. బ్లాక్‌ సాల్ట్‌ వినియోగంతో సలాడ్, ఫ్రూట్, జ్యూస్ తయారుచేసేటప్పుడు బ్లాక్ సాల్ట్ వాడుతున్నారు . బ్లాక్ సాల్ట్ వాడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇది అద్భుతమైన రుచిని అందిస్తుంది.. కానీ, దాని తయారీ ప్రక్రియ చాలా పెద్దది. 24 గంటల శ్రమ తర్వాత ఈ బ్లాక్ ఉప్పు తయారవుతుంది. బ్లాక్ సాల్ట్ తయారీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ సాల్ట్ తయారు చేసే విధానాన్ని వీడియోలో చూపించారు.

Black Salt: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బ్లాక్ సాల్ట్.. తయారీ ఎంత ప్రమాదకరమో తెలుసా..? వీడియో వైరల్‌
Black Salt Making
Follow us on

ఆహారంలో ఉప్పుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అది వంటకం అయినా సరే..అందులో ఉప్పు లేకపోతే అది ఎలాంటి రుచి ఉండదు. అందుకే ఉప్పుకు మించిన రుచి మరొకటి లేదని అంటారు. ఉప్పు లేని ఆహారాన్ని రుచి చూడలేము. ఆహారంలో ఎన్ని మసాలాలు వేసినా, నూనె, వెన్న, నెయ్యి ఎన్ని కలిపినా సరే.. ఉప్పు లేకుండా నాలుకకు అంటదు. కాబట్టి మన వంటలన్నింటిలోనూ ఉప్పునే వినియోగిస్తారు. అలాగని ఉప్పు ఎక్కువగా వేసుకుని తింటే రక్తపోటు వంటి ఎన్నో సమస్యలు మొదలవుతాయి. అయితే, ప్రస్తుతం పెరిగిపోయిన అనారోగ్య కారణాల వల్ల తెల్ల ఉప్పును కాకుండా బ్లాక్‌సాల్ట్‌ ను చాలా మంది వినియోగిస్తున్నారు. బ్లాక్‌ సాల్ట్‌లో పొటాషియంతో పాటు మెగ్నీషియం, క్యాల్షియం వంటి అనేక రకాల పోషకాలు లభిస్తాయి. అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు, మధుమేహం ఉన్నవారు బ్లాక్ సాల్ట్‌ను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల ఉప్పులు అందుబాటులో ఉన్నాయి. తెల్ల ఉప్పు నుండి పింక్‌ సాల్ట్‌ వరకు అందుబాటులో ఉంటుంది. బ్లాక్‌ సాల్ట్‌ వినియోగంతో సలాడ్, ఫ్రూట్, జ్యూస్ తయారుచేసేటప్పుడు బ్లాక్ సాల్ట్ వాడుతున్నారు . బ్లాక్ సాల్ట్ వాడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇది అద్భుతమైన రుచిని అందిస్తుంది.. కానీ, దాని తయారీ ప్రక్రియ చాలా పెద్దది. 24 గంటల శ్రమ తర్వాత ఈ బ్లాక్ ఉప్పు తయారవుతుంది. బ్లాక్ సాల్ట్ తయారీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ సాల్ట్ తయారు చేసే విధానాన్ని వీడియోలో చూపించారు.

ఇవి కూడా చదవండి

బ్లాక్ సాల్ట్ తయారు చేసే విధానం:

బ్లాక్ సాల్ట్ తయారు చేసే విధానం చాలా కఠినమైనది. కష్టమైనది. శ్రమతో కూడుకున్నది.. చాలా ప్రమాదకరమైనది. దీన్ని తయారు చేసేందుకు ఫ్యాక్టరీలో 24 గంటలూ టైర్లను కాల్చేస్తున్నారు. అలాగే, తయారీ ప్రక్రియ పరిశుభ్రంగా లేదు. ఐతే ఈ వీడియో చూసిన వారు బ్లాక్ సాల్ట్ తినడం సురక్షితమేనా అని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరల్‌ వీడియో చూశాక కొందరు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు.. ఇకపై బ్లాక్‌ సాల్ట్‌ తినటం మానేయాలని నిర్ణయించుకున్నామంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..