Viral: ఇలా తయారయ్యారేంట్రా..! ప్లాస్టిక్ బ్యాగులో మూత్ర విసర్జన.. కెమెరాకు చిక్కిన పండ్ల వ్యాపారి

| Edited By: Ravi Kiran

Sep 25, 2024 | 9:09 PM

ఘజియాబాద్‌లో మూత్రంలో జ్యూస్ కలిపి ఇచ్చిన వ్యవహారం ఇంకా మరువకముందే మహారాష్ట్రలో మరో జుగుప్సాకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

Viral: ఇలా తయారయ్యారేంట్రా..! ప్లాస్టిక్ బ్యాగులో మూత్ర విసర్జన.. కెమెరాకు చిక్కిన పండ్ల వ్యాపారి
Fruit Seller
Follow us on

ఘజియాబాద్‌లో మూత్రంలో జ్యూస్ కలిపి ఇచ్చిన వ్యవహారం ఇంకా మరువకముందే మహారాష్ట్రలో మరో జుగుప్సాకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పండ్ల వ్యాపారి తన బండి దగ్గర నిలబడి ప్లాస్టిక్ సంచిలో మూత్ర విసర్జన చేసి, ఆపై అదే చేతులతో వినియోగదారులకు పండ్లు అమ్మడం కనిపించింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటనను స్థానికులు తీవ్రంగా ఖండిస్తున్నారని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయం ఆరోగ్యం, పరిశుభ్రతపై తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

థానేలోని డోంబివాలి జిల్లాలో 20 ఏళ్ల యువకుడిని ఆదివారం(సెప్టెంబర్ 22) అరెస్టు చేశారు, అతను ప్లాస్టిక్ బ్యాగ్‌లో మూత్ర విసర్జన చేసి చేతులు కడుక్కోకుండా పండ్లు అమ్ముతున్నట్లు ఆరోపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మన్‌పాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, డోంబివాలిలోని నీల్జే ప్రాంతంలోని మార్కెట్‌లో ఈ సంఘటన జరిగింది. వ్యక్తిని అలీ ఖాన్‌గా గుర్తించారు. ఈ వీడియో వైరల్ కావడంతో స్థానికులు మార్కెట్‌లోకి ప్రవేశించి పండ్ల దుకాణాన్ని ధ్వంసం చేశారు. పోలీసులు సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. నిందితుడు అలీఖాన్‌ను అరెస్ట్ చేసి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇంతకు ముందు కూడా రొట్టెలు ఉమ్మివేయడం, మూత్రంలో రసం కలపడం వంటి అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ఇలా ఒకదాని తర్వాత మరొకటి వరుస ఘటనలు చోటు చేసుకుంటుండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహారించాలని కోరుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..