
ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎన్నో ప్రత్యేకమైన వీడియోలు వైరల్ అవుతాయి. అందుకే సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారు ఎప్పుడూ నీరసంగా ఉండలేరు. విచిత్రమైన హాలోవీన్ చిలిపి పనుల నుండి ప్రాణాంతకమైన వెరైటీ ఫుడ్స్ తయారీ వరకు ఇక్కడ ఎన్నో చూశాం..అలాగే, రోడ్లమీద అనుకోకుండా కనిపించేవి కూడా అప్పుడప్పుడు మనల్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. అలాంటి ఒక వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వీడియో మహారాష్ట్రకు చెందినదిగా తెలిసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడిన ఈ వీడియోలో ఒక ఆటో డ్రైవర్ తన వాహనాన్ని ఎంతో విలాసవంతంగా మోడిఫైడ్ చేసకున్నాడు. అది చూసిన వారంతా వావ్ అంటున్నారు.
మహారాష్ట్రలోని ఒక ఆటోరిక్షా వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. ఒక డ్రైవర్ తన ఆటోను లగ్జరీ వాహనంగా మార్చాడు. ఇందులో ఎయిర్ కండిషనింగ్, పవర్ విండోస్ వంటి సౌకర్యాలు కల్పించాడు. ఆటోలోని సీట్లను స్లీపింగ్ బెడ్‌లుగా మార్చాడు. వాహనం రెండు వైపులా నాలుగు గేట్లతో సవరించాడు. తరువాత ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెనుక సీట్లకు పవర్ విండోస్ ఏర్పాటు చేశాడు. ఎయిర్ కండిషనర్ ఏర్పాటు చేశాడు. అలాగే, మీరు ఎక్కువసేపు ఆ ఆటోలో ప్రయాణిస్తుంటే, వెనుక సీటును బెడ్‌గా మార్చుకునే వెసులుబాటు కల్పించాడు. ప్రయాణీకులకు తగినంత స్థలం ఉండేలా ఏర్పాటు చేశాడు.
ఈ వీడియోను uff_sam అనే యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఆటో-రిక్షా కనిపిస్తుంది. బయటి నుండి చూస్తే, ఇది సాధారణ ఆటో-రిక్షాలా కనిపిస్తుంది. కానీ, మీరు లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది.. అది మామూలు ఆటో కాదు ఓ లగ్జరీ కారును మించిన సదుపాయాలను కూడా చూస్తారు. ఈ ఆటో-రిక్షాలో పవర్ విండోస్, ఏసీ, కన్వర్టిబుల్ సీట్లు, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉన్నాయి. లోపల కూర్చున్నప్పుడు మీరు లగ్జరీ కారులో ఉన్నట్లు అనిపిస్తుంది.
వీడియో ఇక్కడ చూడండి..
ఈ వీడియో మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతం బద్నేరా నుండి వచ్చింది. మరొక వీడియోలో ఆటో యజమానిని కూడా పరిచయం చేశాడు. ఈ వీడియో త్వరగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన చాలా మంది తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఆటో డ్రైవర్ దీనిని OYO గదిగా మార్చాలని ప్లాన్ చేస్తున్నారా అని కొందరు అడిగారు. అలాగే, కొందరు నెటిజన్లు ఈ ఆటో డ్రైవర్ సృజనాత్మకతను కూడా ప్రశంసించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…