Viral Video: జ్యోతిర్లింగ క్షేత్రానికి వెళ్లారు.. కేవలం రిక్షాలో చోటు కోసం ఓ రేంజ్‌లో కొట్టుకున్నారు.. వీడియో వైరల్

ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆలయం వద్ద ఉన్న ఈ-రిక్షాలో కూర్చోవడం విషయంపై భక్తుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు వీడియో చూస్తే తెలుస్తుంది. అనంతరం.. భక్తులు బాహాబాహీకి దిగి ఒకరినొకరు కొట్టుకోవడం ప్రారంభించారని పోలీసులు తెలిపారు.

Viral Video: జ్యోతిర్లింగ క్షేత్రానికి వెళ్లారు.. కేవలం రిక్షాలో చోటు కోసం ఓ రేంజ్‌లో కొట్టుకున్నారు.. వీడియో వైరల్
Fight Breaks Out Between Devotees At Ujjain's Mahakaleshwar Temple

Updated on: Jan 27, 2023 | 11:23 AM

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. మహాకాళేశ్వర ఆలయంలో భక్తుల మధ్య పోరు జరిగింది. ఈ వారం ప్రారంభంలో మహాకాళేశ్వర్ ఆలయంలో రెండు వర్గాల భక్తుల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆలయం వద్ద ఉన్న ఈ-రిక్షాలో కూర్చోవడం విషయంపై భక్తుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు వీడియో చూస్తే తెలుస్తుంది. అనంతరం.. భక్తులు బాహాబాహీకి దిగి ఒకరినొకరు కొట్టుకోవడం ప్రారంభించారని పోలీసులు తెలిపారు. వైరల్ వీడియోలో ఇతర భక్తులు భయాందోళనతో చూస్తుండగా వారు ఒకరినొకరు దూషించుకుంటూ.. కొట్టుకోవడం కనిపిస్తుంది. మరికొందరు వ్యక్తులు పోరాటంలో జోక్యం చేసుకుని గొడవను ఆపడానికి ప్రయత్నించడం కూడా కనిపిస్తుంది.

 

ఇవి కూడా చదవండి

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భక్తుల మధ్య జరిగిన పోట్లాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పోలీసుల దృష్టికి చేరుకుంది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని..  అయితే వారిలో ఎవరూ ఫిర్యాదు చేయలేదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో పోలీసుల భద్రతను కూడా పెంచుతామని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..