దేశవ్యాప్తంగా ట్రాఫిక్ రూల్స్‌ని కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ రూల్స్ ను పాటించని వారిపై చర్యలు తీసుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు రెడీగా ఉంటున్నారు. ఈ క్రమంలో నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. టూవీలర్‌పై ప్రయాణించే వారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, ఇద్దరి కంటే ఎక్కువగా వాహనంపై వెళ్లకుండా చూస్తున్నారు. కారులో సీట్ బెల్ట్, తాగి వాహనాలు నడపడం వంటివి చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఓ క్రమంలోనే అప్పుడప్పుడు ట్రాఫిక్ పోలీసులు కొన్ని చర్యలు అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంటాయి. అలాంటి ఘటనే ఒకటి ఇంటర్ నెట్‌లో వైరల్ అవుతోంది. ఇక్కడ ఓ పాదచారుడికి ఫైన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు.
మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఓ వింత కేసు వెలుగు చూసింది. ఇక్కడ హెల్మెట్ ధరించనందుకు పాదచారులకు పోలీసులు చలాన్ విధించారు.. అవును మీరు విన్నది నిజమే.. హెల్మెట్ లేకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిన వ్యక్తికి రూ.300 జారీ విధించారు ట్రాఫిక్ పోలీసులు. సుశీల్ కుమార్ శుక్లా అనే వ్యక్తి తన కూతురు పుట్టినరోజు సందర్భంగా కేక్ కొనేందుకు నడుచుకుంటూ వెళ్లిన ఓ వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించారు. దారిలో పోలీసులు మమ్మల్ని కలుసుకుని తమతో తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్‌లో బైక్ ముందు నిలబెట్టి ఫొటోలు తీసి రూ.300 చలాన్ జారీ చేశారు. అంతేకాదు తనను బెదిరించారని కూడా ఆ వ్యక్తి ఆరోపించాడు. దాంతో కంగుతిన్న సదరు వ్యక్తి వెంటనే ఎస్పీ కార్యాలయానికి చేరుకుని తమకు న్యాయం చేయాలని, ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటన 2024 జనవరి 4న జరిగిందని సుశీల్ కుమార్ శుక్లా తెలిపారు.
జరిగిన ఘటనపై సదరు వ్యక్తి పోలీసు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అజయ్‌గర్ రవి జాదౌన్ స్పందిస్తూ.. హెల్మెట్ ధరించనందుకు పాదచారులకు చలాన్ జారీ చేయడం జరగదని, అసలు విషయంలో ఏంటో తెలియాల్సి ఉందన్నారు. ఈ విషయంపై విచారణ జరుపుతామని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి