డాక్టర్స్ ఆపరేషన్ చేస్తుంటే రీల్స్ చూస్తున్న పేషెంట్.. కారణం తెలిస్తే శభాష్‌ అంటారు..!

|

Sep 12, 2024 | 3:21 PM

ఆపరేషన్ సమయంలో రోగి తన చేతులు, కాళ్ళను కదిలిస్తూనే ఉన్నాడు. అంతేకాదు.. ఆపరేషన్ సమయంలో అతడు మొబైల్ ఫోన్‌లో రీల్స్‌ చూస్తూ ఉన్నాడు. తన చేతులు, కాళ్ళను నిరంతరం ఊపుతూనే ఉన్నాడు.. ఈ సమయంలో న్యూరోసర్జన్ సంక్లిష్ట శస్త్రచికిత్సలు చేయడంలో విజయం సాధించారు. ఇన్స్టిట్యూట్ మెడికల్ సూపరింటెండెంట్, డాక్టర్ దేవాశిష్ శుక్లా మాట్లాడుతూ..

డాక్టర్స్ ఆపరేషన్ చేస్తుంటే రీల్స్ చూస్తున్న పేషెంట్.. కారణం తెలిస్తే శభాష్‌ అంటారు..!
Patient Kept Watching Instagram
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో వైద్యులు విజయవంతంగా బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేశారు. లక్నోలోని కళ్యాణ్ సింగ్ క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ ఇనిస్టిట్యూట్‌లో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ జరిగింది. అది కూడా రోగి పూర్తి మేలకువగా ఉండగానే అతనికి ఆపరేషన్‌ నిర్వహించారు వైద్యులు. ప్రస్తుతం అతను ఆస్ప్రతిలో ఉన్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉందని వైద్యులు వెల్లడించారు. అతి త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశార్జ్‌ కానున్నట్టుగా చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లోని న్యూరో సర్జరీ విభాగం చైర్మన్ డాక్టర్ విజేంద్ర కుమార్ మాట్లాడుతూ.. 56 ఏళ్ల బాధితుడు హరిశంకర్ ప్రజాపతి తన కుటుంబంతో తన వద్దకు వచ్చాడని, హరిశంకర్ గత కొన్ని రోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా కూడా నొప్పి నయం కాలేదని చెప్పాడు. ఈ కారణంగా రోగి తీవ్రమైన తలనొప్పిని భరించలేక ఆస్పత్రిలో చేరాడు. అలాగే, అతనికి ఎడమ చేయి, కాలు చాలా బలహీనంగా ఉండటం గమనించి రోగికి ఎంఆర్ఐ కూడా తీశామని చెప్పారు. అప్పుడే అతడి మెదడులో కణితి ఉన్నట్లు గుర్తించామన్నారు.

ఆపరేషన్ తర్వాత రోగికి పక్షవాతం వచ్చే అవకాశం ఉన్నందువల్ల అవేక్ క్రానియోటమీ అనే కొత్త సాంకేతికతను ఉపయోగించి రోగికి ఆపరేషన్ చేయాలని నిర్ణయించామని చెప్పారు.. ఇందులో రోగికి మత్తు ఇంజక్షన్ ఇవ్వడానికి బదులు ఆపరేషన్ చేసిన ప్రదేశాన్ని మాత్రమే మత్తుగా మారుస్తారు. ఈ టెక్నిక్‌తో ఆపరేషన్ చేయడం ద్వారా.. చేతులు, కాళ్ళ నరాలను రక్షించే అవకాశం ఉంటుంది. రోగి, అతడి కుటుంబ సభ్యుల సమ్మతి మేరకు అతనికి ఆపరేషన్ జరిగిందని డాక్టర్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

ఆపరేషన్ సమయంలో రోగి తన చేతులు, కాళ్ళను కదిలిస్తూనే ఉన్నాడు. అంతేకాదు.. ఆపరేషన్ సమయంలో అతడు మొబైల్ ఫోన్‌లో రీల్స్‌ చూస్తూ ఉన్నాడు. తన చేతులు, కాళ్ళను నిరంతరం ఊపుతూనే ఉన్నాడు.. ఈ సమయంలో న్యూరోసర్జన్ సంక్లిష్ట శస్త్రచికిత్సలు చేయడంలో విజయం సాధించారు. ఇన్స్టిట్యూట్ మెడికల్ సూపరింటెండెంట్, డాక్టర్ దేవాశిష్ శుక్లా మాట్లాడుతూ.. ఆపరేషన్ సమయంలో మొత్తం మెదడు మ్యాపింగ్ నరాల పర్యవేక్షణ యంత్రంతో జరిగింది. దీని కారణంగా చేయి, కాలు, నరాలను రక్షించడం ద్వారా కణితిని విజయవంతంగా తొలగించారు. ఈ ఆపరేషన్ విజయవంతం చేసినందుకు శుక్లా న్యూరోసర్జరీ బృందాన్ని అభినందించారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి