Viral Video: నడిరోడ్డుపై గర్ల్‌ఫ్రెండ్‌తో రొమాన్స్.. సీన్ కట్ చేస్తే.. ఆఖర్లో అదిరిపోయే ట్విస్ట్..!

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. వాటిల్లో కొన్ని భయంకరంగా ఉంటే.. మరికొన్ని ఫన్నీగా ఉంటాయి.

Viral Video: నడిరోడ్డుపై గర్ల్‌ఫ్రెండ్‌తో రొమాన్స్.. సీన్ కట్ చేస్తే.. ఆఖర్లో అదిరిపోయే ట్విస్ట్..!
1

Updated on: Mar 02, 2023 | 1:00 PM

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. వాటిల్లో కొన్ని భయంకరంగా ఉంటే.. మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. ఇంకొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ వీడియో కూడా ఆ కోవకు చెందినది. ఇందులో ఓ జంట నడిరోడ్డుపై రొమాన్స్ చేస్తూ కనిపిస్తారు. కానీ ఆఖర్లో జరిగే సీన్ చూస్తే.. మాత్రం మతిపోయి మైండ్ బ్లాంక్ అయితది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ యువతి బైక్‌పై కూర్చుని ఉంటే.. ప్రియుడు ఆమె ముందు నిల్చుని మాట్లాడుతుండటం మీరు చూడవచ్చు. కొద్దిసేపు వీరి మధ్య మాటామంతీ జరగ్గా.. అనంతరం అతడు.. ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. మొదటిసారి ఆమె దాన్ని సున్నితంగా తిరస్కరిస్తుంది. కానీ అతడు మరోసారి కూడా ప్రయత్నిస్తాడు. ఈసారి ఆమె చిరాకు పడుతుంది.

అంతే! అతడు కోపంతో కొట్టడానికి ప్రయత్నించగా.. రివర్స్‌లోనే సదరు మహిళ.. తన ప్రియుడిపై పిడిగుద్దులతో పొట్టుపొట్టుగా కొడుతుంది. ఇలా ఒకరినొకరు పిచ్చపిచ్చగా కొట్టేసుకుంటారు. కాగా, రొమాంటిక్‌గా మొదలైన వారి సీన్.. ఇలా వైలెంట్‌గా మారడంతో ఒక్కసారిగా ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.